మార్కెట్‌ బౌన్స్‌బ్యాక్‌- ఐటీ వీక్‌

మార్కెట్‌ బౌన్స్‌బ్యాక్‌- ఐటీ వీక్‌

ముడిచమురు ధరల మంటతో ముందురోజు పతనమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్‌ అయ్యాయి. డెరివేటివ్స్‌ ముగింపు, ఎన్నికల మూడో దశ పోలింగ్‌ నేపథ్యంలో ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో వెనువెంటనే జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 175 పాయింట్లు పెరిగి 38,820కు చేరగా.. నిఫ్టీ 43 పాయింట్లు పుంజుకుని 11,637 వద్ద ట్రేడవుతోంది. చమురు ధరలు పెరగడంతో సోమవారం రూపాయి ఒక్కసారిగా నీరసించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో సోమవారం మార్కెట్లు తొలి నుంచీ అమ్మకాల ఒత్తిడిలోనే కదిలాయి. చివరికి పతనంతో నిలిచాయి.

అన్ని రంగాలూ
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ బలపడగా.. ఐటీ 0.3 శాతం నీరసించింది. రియల్టీ, ఫార్మా, బ్యాంక్స్‌, మెటల్‌ 1-0.6 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో జీ, సిప్లా, ఇండస్‌ఇండ్, యస్‌ బ్యాంక్‌, ఆర్‌ఐఎల్‌, హీరోమోటో, కోల్‌ ఇండియా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, సన్ ఫార్మా 2.7-0.8 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే గెయిల్‌ 3.3 శాతం క్షీణించగా.. ఎన్‌టీపీసీ, టీసీఎస్‌, ఇన్‌ఫ్రాటెల్‌, పవర్‌గ్రిడ్‌, అదానీ పోర్ట్స్‌, ఎల్‌అండ్‌టీ, టెక్‌ మహీంద్రా, గ్రాసిమ్‌, విప్రో 1-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. 

ఎఫ్‌అండ్‌వో ఇలా
డెరివేటివ్‌ స్టాక్స్‌లో జెట్‌ ఎయిర్‌వేస్‌, లుపిన్‌, దివాన్‌ హౌసింగ్‌, రిలయన్స్ కేపిటల్‌, ఎన్‌సీసీ, అలహాబాద్‌ బ్యాంక్‌, డిష్‌ టీవీ 4-1.6 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క పీసీ జ్యువెలర్స్‌, ఇన్ఫీబీమ్‌, జైన్‌ ఇరిగేషన్, సీజీ పవర్, సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌, బెర్జర్‌ పెయింట్స్‌, చెన్నై పెట్రో, టీవీ 18బ్రాడ్‌ 4-1 శాతం మధ్య వెనకడుగు వేశాయి. 

చిన్న షేర్లు ఓకే
మార్కెట్లు ఉత్సాహంగా కదులుతున్న నేపథ్యంలో మధ్య, చిన్నతరహా షేర్లకూ డిమాండ్‌ కనిపిస్తోంది. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.3 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 750 లాభపడగా.. 368 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. స్మాల్‌ క్యాప్స్‌లో ఎస్‌వీపీ, కేపిటల్‌ ట్రస్ట్‌, లిండే, మన్‌, శిల్పా, జేకే అగ్రి, తేజాస్‌, జేబీఎఫ్‌, మోల్డ్‌టక్‌, డీఐఎల్‌, జాన్సన్‌ కంట్రోల్స్‌ తదితరాలు 8-4 శాతం మధ్య జంప్‌ చేశాయి.Most Popular