ట్రేడింగ్‌కు ఏది బెస్ట్ టైం ! గోల్డ్‌మాన్ ఇంట్రెస్టింగ్ రిపోర్ట్

ట్రేడింగ్‌కు ఏది బెస్ట్ టైం ! గోల్డ్‌మాన్ ఇంట్రెస్టింగ్ రిపోర్ట్

క్యూ4 ఫలితాల సీజన్ మొదలైపోయింది. ఇప్పుడు స్టాక్స్ కదలికలలో మార్పులు కూడా ఎక్కువగానే కనిపిస్తుంటాయి. మరి ఇప్పుడు ఆయా స్టాక్స్ ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను ఎలా పసిగట్టడం అనే విషయం అంతు చిక్కదు. ఈ సమస్యకు చక్కటి రిపోర్ట్‌తో సమాధానం ఇస్తోంది గోల్డ్‌మాన్ శాక్స్.

గత దశాబ్దకాలంలో, ఫలితాల సీజన్‌కు ముందు లిక్విడిటీ పెరగడం గమనించవచ్చు. ఇక ఫలితాల రోజున ఇది మందగించడం మాత్రమే కాకుండా, వోలటాలిటీ పెరిగిపోవడం కనిపిస్తుందని యు.ఎస్. బ్యాంక్ వెల్లడించింది. దీన్నే మరింత స్పష్టంగా చెప్పాలంటే, కార్పొరేట్ ఫలితాలపై అంచనాలతో వాల్యూమ్స్ గణనీయంగా పెరుగుతున్నాయి, ఇంకా వాటికి ప్రతిస్పందించినప్పుడు ఊగిసలాట పెరుగుతోంది.

ఏదైనా ఒక స్టాక్‌ను లిక్విడిటీ ప్రకారం యాక్సెస్ చేసేందుకు, ఫలితాల ప్రకటనకు ముందు ఐదు రోజుల అత్యంత ఆకర్షణీయంగా చెప్పవచ్చని.... జాన్ మార్షన్ నేతృత్వంలోని గోల్డ్‌మాన్ వ్యూహకర్తలు అంటున్నారు. ఇది ఫలితాల ముందు పొజిషన్ తీసుకోవడం కాగా... ఎగ్జిట్ అయ్యేందుకు నాలుగు నుంచి ఆరు రోజులు ఆగాలని సూచిస్తున్నారు.

2018 చివరి స్థాయిలో నమోదు చేసిన పలు సంవత్సరాల కనిష్ట స్థాయితో, గత మూడు నెలలుగా లిక్విడిటీ నమోదు పరిస్థితి ప్రకారం, గోల్డ్‌మాన్ ఈ నివేదికను మరింత మెరుగుపరిచింది. డిసెంబర్‌లో ఇచ్చిన ఓ నివేదికలో, 2018లో ఈక్విటీ ఓలటాలిటీ మరియు సంబంధిత ఆర్థిక స్థిరత్వం మధ్య డైవర్జెన్స్ పెరిగిందని, దీనిని లిక్విడిటీ ప్రకారం వివరించవచ్చని, వ్యూహకర్తలు మార్షల్ - రాకీ ఫిష్‌మ్యాన్ తెలిపారు.

జేపీ మోర్గాన్ కూడా తరచుగా ఇలాంటి భయాలను వెల్లడిస్తుంది. లిక్విడిటీ మరియు ఓలటాలిటీల మధ్య ఉన్న రిలేషన్ కారణంగా, ధరలలో మార్పులు సంభవిస్తాయని, తాజాగా మరోసారి చెప్పింది. రాబోయే 3 నెలల కాలానికి 25 అత్యంత వైవిధ్యమైన ఐడియాస్‌ను కూడా మార్షల్స్ ఇచ్చిన ఏప్రిల్ నివేదికలో ఉంది. 

అలాగే, మొత్తం మార్కెట్లను వినియోగ ఔట్‌పెర్ఫామ్ చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ఫలితాలు వెల్లడించే రోజున ఆయా స్టాక్స్‌ల కదలికలనే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. ఆప్షన్స్ మార్కెట్‌లో కూడా అవకాశాలను పట్టుకోవచ్చని సూచిస్తున్నారు.