గోవా కార్బన్‌, ఐసీఐసీ లంబార్డ్‌-డౌన్‌

గోవా కార్బన్‌, ఐసీఐసీ లంబార్డ్‌-డౌన్‌

గత ఆర్థిక సంవత్సరం(2018-19) చివరి త్రైమాసికంలో రివర్స్‌ టర్న్‌అరౌండ్‌ ఫలితాలు ప్రకటించడంతో ప్రయివేట్‌ రంగ సంస్థ గోవా కార్బన్‌ కౌంటర్‌లో ఉన్నట్టుండి అమ్మకాలు ఊపందుకున్నాయి. మరోవైపు గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో సాధించిన ఫలితాలు నిరాశపరచడంతో ప్రయివేట్‌ రంగ సంస్థ ఐసీఐసీఐ లంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్ కౌంటర్‌ సైతం ఇన్వెస్టర్ల అమ్మకాల కారణంగా డీలా పడింది. ఇతర వివరాలు చూద్దాం..

గోవా కార్బన్‌
గతేడాది క్యూ4లో గోవా కార్బన్‌ రూ. 8.8 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2017-18) క్యూ4లో దాదాపు రూ. 12 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం(ఎన్‌ఐఐ) సైతం 21 శాతం క్షీణించి రూ. 128 కోట్లకు పరిమితమైంది. 2018-19 పూర్తి ఏడాదికి రూ. 7.5 కోట్ల నికర నష్టం ప్రకటించగా.. అంతక్రితం రూ. 54 కోట్ల నికర లాభం నమోదైంది. ఈ నేపథ్యంలో గోవా కార్బన్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 9 శాతం కుప్పకూలి రూ. 434 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 428 వవరకూ పతనమైంది. 

Image result for icici lombard insurance

ఐసీఐసీఐ లంబార్డ్‌ 
గతేడాది క్యూ4లో ఐసీఐసీఐ లంబార్డ్‌ నికర లాభం 7.5 శాతమే పెరిగి రూ. 228 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం 22.6 శాతం జంప్‌చేసి రూ. 2633 కోట్లను తాకింది. స్థూల ప్రత్యక్ష ప్రీమియం ఆదాయం 19 శాతం పుంజుకుని రూ. 3485 కోట్లకు చేరింది. అయితే ఫలితాలు అంచనాలను చేరకపోవడంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఐసీఐసీఐ లంబార్డ్‌ షేరు 2.5 శాతం నీరసించి రూ. 1069 దిగువన ట్రేడవుతోంది. తొలుత రూ. 1037 వరకూ క్షీణించింది.Most Popular