డీసీబీ బ్యాంక్‌- టాటా కాఫీ అప్‌

డీసీబీ బ్యాంక్‌- టాటా కాఫీ అప్‌

గత ఆర్థిక సంవత్సరం(2018-19) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో ప్రయివేట్‌ రంగ సంస్థ డీసీబీ బ్యాంక్‌ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. మరోవైపు గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో పటిష్ట ఫలితాలు సాధించడంతో టాటా గ్రూప్‌ సంస్థ టాటా కాఫీ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ రెండు కౌంటర్లూ నష్టాల మార్కెట్లోనూ లాభాలతో కళకళలాడుతున్నాయి. ఇతర వివరాలు చూద్దాం..

డీసీబీ బ్యాంక్‌
గతేడాది క్యూ4లో డీసీబీ బ్యాంక్‌ నికర లాభం 50 శాతం జంప్‌చేసి రూ. 96 కోట్లను తాకింది. నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 16 శాతం పెరిగి రూ. 99 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 3.8 శాతంగా నమోదుకాగా.. ఇకపైనా ఇదే స్థాయిలో మార్జిన్లను నిలుపుకోగలమని బ్యాంక్‌ యాజమాన్యం పేర్కొంది. ఈ నేపథ్యంలో డీసీబీ బ్యాంక్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 2.5 శాతం పుంజుకుని రూ. 207 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 211 వవరకూ ఎగసింది. వెరసి 2017 జూన్‌లో నమోదైన చరిత్రాత్మక గరిష్టం రూ. 213 సమీపానికి చేరింది.

Image result for tata coffee ltd

టాటా కాఫీ
గతేడాది చివరి త్రైమాసికంలో పానీయాల సంస్థ టాటా కాఫీ నికర లాభం 62 శాతం జంప్‌చేసి రూ. 10.5 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 4.5 శాతం పుంజుకుని రూ. 460 కోట్లను అధిగమించింది. వాటాదారులకు షేరుకి రూ. 1.5 డివిడెండ్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో టాటా కాఫీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 2 శాతం పెరిగి రూ. 94 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 95ను అధిగమించింది.Most Popular