దివాన్‌ లబోదిబో- జీవీకే జూమ్‌

దివాన్‌ లబోదిబో- జీవీకే జూమ్‌

రేటింగ్‌ దిగ్గజం క్రిసిల్‌ డౌన్‌గ్రేడ్‌ చేయడంతో గత వారాంతాన దెబ్బతిన్న ఎన్‌ఎబీఎఫ్‌సీ కౌంటర్ దివాన్‌ హౌసింగ్ మరోసారి పతన బాట పట్టింది. ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడటంతో భారీ నష్టాలతో కదులుతోంది. అయితే మరోపక్క ఎయిర్‌పోర్ట్స్‌ అనుబంధ సంస్థలో వాటా విక్రయ వార్తలతో మౌలిక సదుపాయాల హైదరాబాద్‌ సంస్థ జీవీకే పవర్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోది. తద్వారా భారీ లాభాలతో సందడి చేస్తోంది. వివరాలు చూద్దాం...

దివాన్‌ హౌసింగ్‌
కంపెనీ కమర్షయల్‌ పేపర్‌ రేటింగ్‌ను క్రిసిల్ డౌన్‌గ్రేడ్‌ చేయడంతో వారాంతాన 8 శాతం పతనమైన దివాన్‌ హౌసింగ్‌ షేరు మరోసారి డీలాపడింది. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 9.25 శాతం కుప్పకూలి రూ. 143 దిగువన ట్రేడవుతోంది. తొలుత రూ. 140 దిగువకు సైతం చేరింది. నిధుల సమీకరణలో కంపెనీకి సమస్యలు ఎదురయ్యే అంచనాలు, లిక్విడిటీ పరిస్థితులు తదితరాల నేపథ్యంలో రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసినట్లు క్రిసిల్‌ పేర్కొంది. 

Image result for gvk power and infrastructure limited

జీవీకే పవర్‌
అనుబంధ సంస్థలు జీవీకే ఎయిర్‌పోర్ట్‌ డెవలపర్స్‌(GVKADL), జీవీకే ఎయిర్‌పోర్ట్‌ హోల్డింగ్స్‌(GVKAHL) ద్వారా అబుధబీ ఇన్వెస్ట్‌మెంట్‌ అధారిటీ(ADIA), నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌(NIIF)లతో పెట్టుబడి ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు జీవీకే పవర్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ తెలియజేసింది. తద్వారా GVKAHLలో 49 శాతం వాటాను విక్రయించనున్నట్లు పేర్కొంది. నిధులను రుణ చెల్లింపులకు వినియోగించనున్నట్లు తెలియజేసింది. దీంతో జీవీకే పవర్‌ షేరు 8.25 శాతం జంప్‌చేసి రూ. 7.90 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 8.10 వరకూ ఎగసింది.Most Popular