ఈ స్టాక్స్‌లో పెట్టుబడి పెడితే ఏమౌతుంది?  - రాకేశ్‌ ఝన్‌ఝన్‌వాలా అంచనాలు

ఈ స్టాక్స్‌లో పెట్టుబడి పెడితే ఏమౌతుంది?  - రాకేశ్‌ ఝన్‌ఝన్‌వాలా అంచనాలు

గత పదేళ్ళలో దేశీయ మార్కెట్లు రికార్డు స్థాయిలో పెరిగాయని, రాబోయే రోజుల్లోనే ఇదే ట్రెండ్‌ కొనసాగే అవకాశముందని బిగ్‌ బుల్ రాకేశ్‌ ఝన్‌ఝన్‌వాలా అభిప్రాయపడ్డారు. వచ్చే దశాబ్దకాలంలో దేశంలోకి పెద్ద మొత్తంలో విదేశీ నిధుల ప్రవాహం కొనసాగే అవకాశముందని ఆయన అంచనా వేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎంతో సహసంతో తీసుకున్న జీఎస్టీ అమలు, పెద్ద నోట్ల రద్దు ఫలాలు ఇప్పుడు అందుతున్నాయని ఆయన చెప్పారు. ఇతర దేశాల అనుభవాన్ని ఒకసారి పరిశీలిస్తే వారి ఆర్థిక వ్యవస్థ చక్కదిద్దుకోవడానికి ఐదు నుంచి ఏడేళ్ళ సమయం పట్టేది. కాని మనదేశంలో మాత్రం ఏడాది వ్యవధిలోనే అన్ని సమస్యలు చక్కబడ్డాయి. వృద్ధి రేటులో వేగంగా అభివృద్ధి చెందే దేశాల్లో ఒకటిగా భారత్‌ నిలిచింది. దీంతో మరింత నగదు దేశీయ మార్కెట్లోకి వచ్చేందుకు అవకాశం లభించింది. 

బ్యాంక్‌, ఫార్మా, ఇన్‌ఫ్రా రంగాలు బుల్లిష్‌గా కొనసాగే ఛాన్స్‌ ఉందని రాకేశ్‌ ఝన్‌ఝన్‌వాలా అంచనా వేశారు. అలాగే ఎంపిక చేసిన కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కూడా ర్యాలీ కొనసాగే అవకాశముందిన, ప్రస్తుతం ఆయా షేర్లు అట్రాక్టివ్‌ వాల్యూ జోన్‌లో ఉన్నాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం యూఎస్‌ మార్కెట్లో వినియోగించే ఔషధాల్లో మేడ్‌ భారతీయ కంపెనీల వాటా 40-45 శాతంగా ఉంది. దీంతో రాబోయే రోజుల్లో ఫార్మా స్టాక్స్‌ చక్కని రిటర్న్స్‌ ఇచ్చే అవకాశాలున్నాయి. 
 Most Popular