టాటా మోటార్స్ పెరగడానికి 5 కారణాలివే...!!

టాటా మోటార్స్ పెరగడానికి 5 కారణాలివే...!!

గత మూడు నెలలుగా నష్టాల్లో ఉన్న టాటా మోటార్స్ దాదాపు 50శాతం వృద్ధిని కనబరిచింది. అంతే కాకుండా నిఫ్టీ 50లో ఎస్ బ్యాంక్ తరువాత బెస్ట్ పెర్ఫార్మర్‌గా నిలిచింది టాటా మోటార్స్. జగ్వార్ లాండ్ రోవర్ అధినేత అయిన టాటా మోటార్స్ నిఫ్టీ 50 8శాతం వృద్ధిని కనబరిచినప్పుడు దాదాపు 38శాతం పెరిగింది. గత డిసెంబర్‌ లో దాదాపు రూ. 27,000 కోట్ల నష్టాలను అధిగమించి మరీ 50శాతం వృద్ధిని కనబరిచింది ఈ కంపెనీ. టాటా మోటార్స్ ఒక్కసారిగా లాభాల్లోకి రావడానికి ప్రధానంగా 5 కారణాలు పనిచేశాయి. అవేంటో చూద్దాం..!
1. ప్రమోటర్ల అండదండలు:
ఈ ఆటో మేకర్‌కు మూల అధినేతలు అయిన టాటా సన్స్ లిమిటెడ్ టాటా మోటార్స్ కు అండగా నిలబడింది. కంపెనీ నష్టాల్లో ఉన్నప్పుడు కంపెనీలో స్థైర్యం నింపడానికి టాటా సన్స్ దాదాపు 3.16 కోట్ల షేర్లను కొనుగోలు చేసింది. 1.1శాతం స్టాక్స్ ను కొనుగోలు చేసి టాటా మోటర్స్ కు దన్నుగా నిలబడింది. 

Five Reasons Why Tata Motors Stock Has Surged 50% Since Posting Biggest Loss
2. క్రెడిట్ డిఫాల్ట్ మార్పిడులు తగ్గాయి: 
నష్టాల్లో ఉన్న జగ్వార్ ల్యాండ్ రోవర్ క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్స్ (CDS) కాస్త తగ్గడం టాటా మోటార్స్ కు ఊరట నిచ్చింది. రుణ చెల్లింపుల మొత్తం దాదాపు 33శాతం తగ్గడంతో టాటా మోటార్స్ పుంజుకునేందుకు అవకాశం లభించింది. ఒకటి , రెండు , మూడు సంవత్సరాల CDS కాంట్రాక్టులు కూడా తగ్గాయి. జారీ చేసిన బాండ్స్ విలువ పెరగడం, డిఫాల్ట్ రిస్క్ గణనీయంగా తగ్గడం కూడా టాటా మోటార్స్ స్టాక్స్ పెరగడానికి కారణం అయ్యాయి.

 Five Reasons Why Tata Motors Stock Has Surged 50% Since Posting Biggest Loss
3. చైనా ప్రభావం :
టాటా మోటార్స్ ప్రోడక్ట్ అయిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ కు చైనాలో మంచి మార్కెట్ ఉంది. గత మూడు క్వార్టర్లుగా చైనా నుండే మంచి రెవిన్యూను సాధించింది జాగ్వార్ . 2018లో జాగ్వార్ అమ్మకాలు 24శాతం పడిపోయినప్పటికీ.. చైనా అమెరికా ట్రేడ్ వార్ తగ్గుముఖం పట్టడం, జాగ్వార్ అమ్మకాలు పెరగడానికి తగిన ఆర్ధిక వ్యవస్థ చైనాలో తిరిగి నెలకొనడం కంపెనీకి లాభం చేకూర్చింది. 

Image result for jaguar land rover
4. కార్ లైసెన్స్ నిబంధనల సడలింపు
చైనాలోని మేజర్ సిటీస్‌లో కార్ లైసెన్సుల నిబంధనలను సడలించాలని చైనా నేషనల్ డెవలప్‌మెంట్ అండ్ రిపార్మ్ కమీషన్ నిర్ణయించింది. దీని వల్ల టైర్ 1 సిటీల్లో  లగ్జరీ కార్ల తయారీ దార్లకు మేలు చేకూరనుంది. 
5. ఇతర దేశాల్లో పెరిగిన అమ్మకాలు
టాటా మోటార్స్ ఉత్పత్తులు ఇతర దేశాల్లో పుంజుకున్నాయి. 2018లో చైనాలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ అమ్మకాలు తగ్గినా  మిగతా దేశాల్లో అవి 3శాతం పెరిగాయి.  E-పేస్, I- పేస్  వంటి బ్రాండ్ల లాంచింగ్‌తో అమ్మకాలు పెరగడం మొదలెట్టాయి. యూకే, అమెరికా వంటి దేశాల్లో అమ్మకాలు దాదాపు 8శాతం పెరగడం టాటా మోటార్స్ కు కలిసొచ్చింది. 

Image result for jaguar land rover
బ్లూమ్‌బర్గ్ పత్రిక కథనం మేరకు దాదాపు 45శాతం ఎనలిస్టులు టాటా మోటార్స్ స్టాక్స్ మీద  బై రేటింగ్స్ ఇచ్చారు. మరో 43శాతం మంది హోల్డ్  రేటింగ్స్ ఇవ్వగా, కేవలం 12శాతం మంది సెల్ రేటింగ్స్‌ను ఇచ్చారు. ప్రస్తుత మార్కెట్లలో టాటా మోటార్స్ షేర్లు దాదాపు 4శాతం అధికంగా రూ. 239.7 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ప్రముఖ బ్రోకింగ్ సంస్థలు టార్గెట్ ప్రైస్‌ రూ. 580గా నిర్ణయించడం కొసమెరుపుగా చెప్పుకోవచ్చు. 
Image result for jaguar land rover