మ్యూచువల్ ఫండ్స్‌కు ముద్దొస్తున్న IT, బ్యాంకింగ్ స్టాక్స్ ...!

మ్యూచువల్ ఫండ్స్‌కు ముద్దొస్తున్న IT, బ్యాంకింగ్ స్టాక్స్ ...!

గత జనవరి నుండి మార్చ్ వరకూ మ్యూచువల్ ఫండ్ కంపెనీలు దాదాపు రూ. 1000 కోట్ల పెట్టుబడులను స్టాక్ మార్కెట్లలో పెట్టాయి. సుమారు 185 కంపెనీల్లో తమ స్టాక్స్ ను పెంచాయి MF సంస్థలు. అలాగే ఈ మార్చ్ త్రైమాసికానికల్లా 178 కంపెనీల్లో తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్నాయి. నిధుల లభ్యత, బ్యాంకింగ్ క్వార్టర్ ఫలితాలు , ఆర్ధిక సేవలు, నిరర్థక ఆస్తులు తగ్గడం వంటివి నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్‌ను బలపరిచాయి. నిఫ్టీ బ్యాంక్ సూచీలు రికార్డ్ గరిష్టానికి చేరుకున్నాయి. గత నెల రోజులుగా నిఫ్టీ బ్యాంక్  ఇండెక్స్ అప్‌ట్రెండ్‌తో నడుస్తూ.. 11శాతం ర్యాలీ చేసింది. 

Image321042019

courtesy by : Money control 
ఇక మ్యూచువల్ ఫండ్ కంపెనీలు TCS, ITC, HUL, HDFC, ఇన్ఫోసిస్ , SBI, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, IOC, కోల్ ఇండియా వంటి వాటిలో తమ పెట్టుబడులను పెంచాయి. గత కొద్ది రోజులుగా బ్యాంకుల పనితీరు మెరుగుపడటంతో బ్యాంకింగ్ స్టాక్స్ ఆకర్షణీయంగా మారాయని ఫండ్ మెనేజర్స్ భావిస్తున్నారు. 
ఇక IT రంగంలో పలు కంపెనీలు తమ క్వార్టర్ రిజల్ట్స్‌ను మెరుగ్గా ప్రకటించడంతో ఆ రంగంలోని స్టాక్స్‌కు డిమాండ్ పెరిగింది. టాటా కన్సల్టెన్సీ, ITC లిమిటెడ్ , ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు తమ త్రైమాసిక ఫలితాల్లో మంచి రిజల్స్ట్ చూపించడంతో అవి ఫండ్ మేనేజర్స్ ను ఆకర్షించాయి. 
గత జనవరి నుండి మార్చ్ వరకూ మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ... బజాజ్ ఫైనాన్స్ , విప్రో లిమిటెడ్, భారతీ ఎయిర్‌టెల్,  హిందుస్థాన్ జింక్‌,  అల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్ ఇండ్ బ్యాంక్ వంటి కంపెనీల స్టాక్స్ ను తగ్గించుకున్నాయి. 

Image421042019

courtesy by : Money control Most Popular