ఈ స్టాక్స్‌పై ఓ లుక్కేయండి.. (ఏప్రిల్ 22)

ఈ స్టాక్స్‌పై ఓ లుక్కేయండి.. (ఏప్రిల్ 22)
 • క్యూ-4లో రూ.6.46 కోట్ల నుంచి రూ.10.49 కోట్లకు పెరిగిన టాటా కాఫీ నికరలాభం 
 • డాక్టర్‌ రెడ్డీస్‌కు షాక్‌, ఏపీలోని ప్లాంట్‌పై 4 అభ్యంతరాలు వ్యక్తం చేసిన యూఎస్‌ఎఫ్‌డీఏ
 • మే 3న ప్రారంభమై మే 17న ముగియననున్న భారతి ఎయిర్‌టెల్‌ రైట్స్‌ ఇష్యూ
 • శానిటరీ సెగ్మెంట్లోకి ప్రవేశించిన ఏషియన్‌ గ్రానిటో
 • వచ్చే 4-5 సంవత్సరాల్లో రూ.80-100 కోట్ల టర్నోవర్‌ లక్ష్యంతో ఏషియన్‌ గ్రానిటో
 • అనుబంధ సంస్థ క్లాస్‌ప్యాక్‌లో అదనంగా రూ.5 కోట్లను ఇన్వెస్ట్‌ చేయనున్న బోరోసిల్‌ గ్లాస్‌వర్క్స్‌
 • భారతి యాక్సా జనరల్‌ ఇన్సూరెన్స్‌ భాగస్వామ్యంతో ద్విచక్ర వాహనాలకు బీమా సౌకర్యాన్ని ప్రారంభించిన ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌
 • జెట్‌ ఎయిర్‌వేస్‌కు మరో ఎదురుదెబ్బ, స్వతంత్ర డైరెక్టర్ రాజ్‌శ్రీ పాఠి రాజీనామా
 • టాటా స్టీల్‌ లాంగ్‌ ప్రోడక్ట్స్‌గా పేరుమార్చుకున్న టాటా స్పాంజ్‌ ఐరన్‌
 • ఈనెల 24న జరిగే బోర్డు మీటింగ్‌లో బోనస్‌ ఇష్యూ ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకోనున్న సింజెన్‌ ఇంటర్నేషనల్‌
 • మే 22న క్యూ-4 ఫలితాలను ప్రకటించనున్న GSFC
 • ఏప్రిల్‌ 30న నాల్గో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను విడుదల చేయనున్న రేమాండ్‌
 • మే 6న వెలువడనున్న వొకార్డ్‌ క్యూ-4 ఆర్థిక ఫలితాలు
 • ఎల్లుండి జరిగే బోర్డు మీటింగ్‌లో డివిడెండ్‌పై నిర్ణయం తీసుకోనున్న భారతి ఇన్‌ఫ్రాటెల్‌
 • షార్ట్‌టర్మ్‌ ASM ఫ్రేమ్‌వర్క్‌లోకి 8K మైల్స్‌ సాఫ్ట్‌వేర్‌
 • స్పైస్‌జెట్‌, ఎలక్ట్రోథెర్మ్‌, ఎస్సార్‌ షిప్పింగ్‌ సర్క్యూట్‌ ఫిల్టర్‌ 10 శాతానికి సవరింపు


Most Popular