నిఫ్టీ 12 వేలకు వెళ్లకుండా ఆపుతోంది ఇదే  

నిఫ్టీ 12 వేలకు వెళ్లకుండా ఆపుతోంది ఇదే  

గతవారం దేశీయ ఈక్విటీ మార్కెట్లు రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకుపోయాయి. అయితే మన మార్కెట్లపై ఎఫ్ఐఐలకు ఉన్నంత నమ్మకం దేశీయ ఇన్వెస్టర్లకు, రిటైలర్లకు కొరవడింది అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. మనమంతా ఎన్నికల ఫలితాల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాం. యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ తగ్గుముఖం పట్టడంతో మన మార్కెట్లలోకి పెద్ద ఎత్తున నిధుల వరద కొనసాగుతోంది. 

ఐపీఓ సక్సెస్ ఎవరూ ఊహించలేదు
ఫిబ్రవరి నుంచి మన మార్కెట్లో రికార్డ్ ర్యాలీ కంటిన్యూ అవుతోంది. 11800 పాయింట్ల స్ట్రైక్ ప్రైస్ దగ్గర  పటిష్టమైన పుట్ రైటింగ్ జరగడం కూడా ఈ దూకుడుకు మరో కారణం. అంతే కాదు ఆశ్చర్యకరంగా తాజాగా వచ్చిన మెట్రోపొలిస్, పాలిక్యాబ్ ఐపీఓలకు వచ్చిన స్పందన కూడా అవాక్కయ్యేలా చేస్తోంది. ఈ రెండు ఐపీఓల్లో ఒకటి 17.6 శాతం, మరొకటి 9 శాతం ప్రీమియంతో లిస్ట్ అయ్యాయి. షార్ట్ టర్మ్‌లో మన ఎమర్జింగ్ మార్కెట్స్‌పై బుల్ పట్టు గట్టిగా ఉంది. అయితే మే నెలలో వచ్చే ఎన్నికల ఫలితాలు మార్కెట్‌కు ఖచ్చితమైన దిశానిర్దేశం చేస్తాయి. అదే ఈ ర్యాలీకి అతిపెద్ద స్పీడ్ బ్రేకర్. ఒక వేళ ఫలితాలు అంతంతమాత్రంగా వస్తే మాత్రం బొమ్మ తిరగబడొచ్చు. 

Read this also : polycab ipo success 

ఫండమెంటల్స్ చూసినా..
ఈ ఎర్నింగ్స్ సీజన్ టీసీఎస్ ఇచ్చిన రికార్డ్ ఫలితాలతో ఆశ్చర్యపోయింది. మార్చి క్వార్టర్‌లో ప్యాట్ 17.7 శాతం వృద్ధిని నమోదు చేసింది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 35 శాతం నమోదైంది. సుమారు 8 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌కు దగ్గరైన టీసీఎస్, ఐటీ రంగంలో టాప్ పర్ఫార్మర్‌గా ఎదిగింది. ఇన్ఫోసిస్, విప్రోను పక్కకునెట్టి మరీ మెరుగైన పనితీరును క్వార్టర్లీ రిజల్ట్స్‌లో అనౌన్స్ చేసింది. 

స్పైస్ జెట్ - జెట్ ఎయిర్ కథ
జెట్ ఎయిర్ కథ కంచికి చేరడంతో అనూహ్యంగా స్పైస్ జెట్, ఇండిగో ఎయిర్ దూకుడు పెంచాయి. ఎక్కువ మార్జిన్లు ఉండడం వల్ల ఈ ఎపిసోడ్‌లో స్పైస్ మరింత ఘాటును పెంచి వేగంగా పావులు కదిపింది. అందుకే ఇండిగోతో పోలిస్తే షేర్ ప్రైస్ జంప్ విషయంలో ఔట్‌పర్ఫార్మర్‌గా నిలిచింది.

Read - జెట్ ఎయిర్ పతనానికి 7 తప్పులు  

టెక్నికల్ పిక్చర్
ప్రస్తుతం నిఫ్టీ 11856 పాయింట్ల లైఫ్ టైం హై మార్కును టచ్ చేసింది. దీంతో ఇక్కడి నుంచి 100 పాయింట్లపైన అన్ ఛార్జెడ్ జోన్‌లో ఉన్నట్టు చెప్పాలి. గత రెసిస్టెన్స్ లెవెల్స్‌ను పరిశీలించి చూస్తే నిఫ్టీ 11,730 పాయింట్ల దగ్గర పటిష్ట సపోర్ట్ ఉంది. ఒక వేళ మార్కెట్ ఇక్కడి నుంచి బలహీన పడితే గరిష్ట స్థాయిలను దాటి పైకి వెళ్లడం కష్టం. ట్రేడర్లు అందుకే ఓవర్ బాట్ కౌంటర్లలో ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి. ఈ స్థాయిల దగ్గర ఫ్రెష్ లాంగ్స్‌కు వెళ్లడం మాత్రం బెస్ట్ స్ట్రాటజీ కాకపోవచ్చు. 

ఇకపై ఎలాంటి వ్యూహం
ఎలక్షన్ సీజన్ ముగిసే వరకూ ఇకపై మార్కెట్లలో భారీ ర్యాలీని ఆశించలేం. అయితే గరిష్ట స్థాయిల దగ్గర మాత్రం కొద్దిగా ఒడిదుడుకులు ఉండొచ్చు. 
ఫైనాన్స్ రంగం వచ్చే వారం కూడా రాడార్‌లో ఉండొచ్చు. ప్రధానంగా ఇండియాబుల్స్ హౌసింగ్, యెస్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్ స్టాక్స్ తమ ఆర్థిక ఫలితాలను వెల్లడించబోతున్నాయి. 


 Most Popular