ఫ్రీక్వెన్సీ పెంచేందుకు సిద్ధమవుతున్న జియో!

 ఫ్రీక్వెన్సీ పెంచేందుకు సిద్ధమవుతున్న జియో!

దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన నిరంతరాయ సేవల కోసం కొత్త స్పెక్ట్రమ్స్ కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యింది. దాదాపు 300 మిలియన్ల కస్టమర్లు ఉన్న జియో తన 4G, డాటా సేవలను నిర్విఘ్నంగా కొనసాగించడానికి అవసరమైన కొత్త స్పెక్ట్రమ్స్ కొనుగోలు చేయడానికి సముఖతను వ్యక్తం చేసింది. గతంలో  స్పెక్ట్రమ్, టవర్ల వినియోగం విషయంలో అనిల్ అంబానీకి చెందిన ఆర్‌కాంతో ఒప్పందం ఉన్నా సాంకేతిక కారణాలు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం (DoT) కు ఉన్న  ఆర్‌కాం బకాయిలు చెల్లించలేక పోవడం వంటి కారణాలతో ఆర్‌కాం స్పెక్ట్రమ్స్ ను వినియోగించుకోలేకపోయింది జియో. ఆర్‌కాం, జియోల మధ్య స్పెక్ట్రమ్ ఒప్పందాన్ని డిపార్ట్ మెంట్ ఆఫ్‌ టెలికాం ఆమోదించలేదు.

 

దాంతో ఒప్పందం రద్దు చేసుకోవాల్సి వచ్చింది. 2017లో జరిగిన ఒప్పందం ప్రకారం జియో ఆర్‌కాంకు చెందిన 850MHz స్పెక్ట్రమ్‌ను దాదాపు 21 సర్కిళ్ళలో వాడుకునేది.  ఆతరువాత 1800 MHz, 2300 మెగాహెర్జ్స్ సర్కిళ్ళు వాడుకున్నా నిరంతరాయ సర్వీసులకోసం కొత్త స్పెక్ట్రమ్స్ కొనుగోలు చేయాల్సి ఉందని జియో అధికారులు అంటున్నారు. నెలకు సగటున కొత్తగా 10 మిలియన్ల కస్టమర్లు జియోలో చేరుతున్నారు. ఈ ట్రాఫిక్ తట్టుకోవాలంటే జియో మరి కొన్ని స్పెక్ట్రమ్స్ కొనాల్సి వస్తుందని జియో టెక్నికల్ టీం పేర్కొంది. ఆర్‌కాం సంస్థ DoTకి చాలా బకాయిలు ఉండి ఉండటం వల్ల, ఇతర సాంకేతిక కారణాల వల్ల ఆర్‌కాం కు చెందిన స్పెక్ట్రమ్‌ను జియో వాడుకోడానికి వీల్లేకుండా పోయింది. బకాయిలు చెల్లించడానికి ఉన్న డెడ్ లైన్‌ కూడా అయిపోవడంతో ఆర్‌కాం తన స్పెక్ట్రమ్స్ మీద అధికారాన్ని కోల్పోయినట్టైంది. దీంతో జియో ఇతర స్పెక్ట్రమ్స్ వైపు చూడాల్సిన పరిస్థితి ఎదురైంది.

 

రిలయన్స్ ఇండస్ట్రీస్ తన నాలుగో త్రైమాసిక ఫలితాల వెల్లడి రోజున కూడా రిలయన్స్ జియో హెడ్ అండ్ స్ట్రాటజీ అన్షుమన్ ఠాకూర్ మాట్లాడుతూ జియో నిరంతరాయ సేవల కోసం అవసరమైన స్పెక్ట్రమ్స్‌ను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.  ఆర్‌కాంతో ఉన్న ఒప్పందం వీగిపోయినందువల్ల ఇతర మార్గాల వైపు దృష్టి సారించినట్టు ఠాకూర్ తెలిపారు. గత క్యూ 4 ఫలితాల్లో జియో ఎబిటిడాలో 6.8శాతం వృద్ధితో రూ. 1,329కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.  టవర్ రెంటల్స్ లో 20 సంవత్సరాల దీర్ఘకాలిక ఎగ్రిమెంట్లు ఉండటంతో తన సేవలకు ఎలాంటి అంతరాయం కలగదని జియో భావిస్తుంది. ఇప్పటికే లాభాల్లో ఉన్న రిలయన్స్ జియో కొత్తగా స్పెక్ట్రమ్స్ కొనుగోలుకు పెద్దగా సమయం పట్టకపోవచ్చని, తద్వారా నిరంతరాయ సేవలను తన కస్టమర్లకు అందిస్తూనే ఉంటుందని క్రెడిట్ సూసీ వంటి రేటింగ్ సంస్థలు భావిస్తున్నాయి. 
 Most Popular