క్యాపిటల్ గూడ్స్".. క్రేజీ థీమ్‌గా మారనుందా!

క్యాపిటల్ గూడ్స్

రానున్న రోజుల్లో క్యాపిటల్ గూడ్స్‌కు చెందిన స్టాక్స్ మంచి ఫలితాలను ఇవ్వనున్నాయని ఎనలిస్టులు భావిస్తున్నారు. ABB, సీమెన్స్, కుమ్మిన్స్ ఇండియా, థెర్మాక్స్ వంటి స్టాక్స్ గత 5 ఏళ్ళుగా అండర్ ఫెర్ఫ్మార్ చేసినా.. బార్గైన్ హంటర్స్‌కు ఇవి ఆకర్షణీయంగానే కనబడుతున్నాయి. వీటి వాల్యూయేషన్స్ కూడా బిలో యావరేజ్‌లో ఉన్నప్పటికీ.. వినియోగం నెమ్మదించడం మూలాన రానున్న ఐదేళ్ళలో ఇవి మంచి రిటర్న్స్ అందించ వచ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. క్యాపిటల్ గూడ్స్ రంగంలో  L&T, కల్పతరు పవర్, KEC, పాలీక్యాబ్ ఇండియా వంటి కంపెనీలకు  రానున్న 3-5 ఏళ్ళలో స్ట్రాంగ్ ఆర్డర్స్ రావొచ్చని , వీటి వల్ల ఆయా స్టాక్స్ మంచి రిజల్ట్స్ ను అందించనున్నాయని BNP పారిభాస్ అంచనా వేస్తోంది. క్యాపిటల్ గూడ్స్ స్టాక్స్ మీద పెట్టిన పెట్టుబడి గుడ్ ఇన్వెస్ట్‌మెంట్‌గా పారిభాస్ భావిస్తోంది. ప్రస్తుతం క్యాపిటల్ గూడ్స్ రంగంలోని స్టాక్స్ వాటి 5 సంవత్సరాల కనిష్ట సగటులో నమోదౌతున్నప్పటికీ.. రానున్న రోజుల్లో ఇవి బెటర్ పెర్ఫార్మెన్స్ ను ఇవ్వగలవని బ్రోకింగ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఎన్నికల ఫలితాల అనంతరం సుస్థిర ప్రభుత్వం ఏర్పడితే కనుక రానున్న 5 ఏళ్ళలో ఇన్ఫ్రా, కనస్ట్రక్షన్, పవర్ ట్రాన్స్‌మిషన్ , రోడ్స్ మరియు రైల్వేస్ వంటి సెక్టార్స్ లో క్యాపెక్స్ పెరగనుంది. 


అయితే గత మూడు సంవత్సరాల చరిత్రను పరిశీలిస్తే... సీమెన్స్ , ABB స్టాక్స్ 3శాతం ఫ్లాట్ రిటర్న్స్ ను అందించాయి. కుమ్మిన్స్ స్టాక్స్ దాదాపు 17శాతం పడిపోగా, థెర్మాక్స్ , GE పవర్ వంటి స్టాక్స్ 30శాతం క్షీణించాయి. 
స్టీల్ , సిమెంట్ , విద్యుత్ వంటి రంగాల్లో ఆయా కంపెనీల వద్ద ఉన్న కాంట్రాక్టుల విలువ రూ. 20,000 కోట్లుగా ఉంది. ఎన్నికల అనంతరం ఈ ఆర్డర్లు, కాంట్రాక్టులు మరిన్ని పెరగొచ్చని ఎనలిస్టులు భావిస్తున్నారు. రానున్న రోజులు ఈ రంగాలకు ఆశాజనకమే అని వారు పేర్కొంటున్నారు. ఇక రైల్వే రంగం గణనీయంగా వృధ్ధి బాటలో పయనిస్తోంది. సిమెంట్, ఉక్కు  రంగాలు మొత్తం సంఘటితం కావడం కలిసొచ్చే అంశమే.  ఉక్కుకు కూడా పెరుగుతున్న ఆర్డర్లను బట్టి మంచి డిమాండ్ ఏర్పడే అవకాశం ఉందనే చెప్పాలి. సీమెన్స్ సంస్థ ఇంధన సామర్ధ్యం, ఉత్పాదకతల పెరుగదలను బలంగా కాంక్షింస్తుంది. థెర్మాక్స్ కంపెనీ కూడా కెమికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో అవకాశాలు పెరుగుతాయని భావిస్తోంది. కల్పతరు పవర్  సంస్థ T&D నుండి సానుకూల ఆర్డర్లను పొందుతూ ఉంది. గ్రీన్ కారిడార్ పేరిట అంతర్జాతీయ T&D ఆర్డర్లు, రైల్వేస్ , పైప్ లైన్లు, వంటి కాంట్రాక్టులను దక్కించుకోనుంది. L&T దేశ వ్యాప్తంగా రోడ్లు, రైల్వేస్, వాటర్ , రక్షణ రంగం , ఫ్యాక్టరీ నిర్మాణాలు , సిమెంట్ , లోహ రంగాలకు సంబంధించిన ఆర్డర్లు వస్తాయని ఆశావహ ధృక్పథంతో ఉంది. కాబట్టి రానున్న ఎన్నికల ఫలితాల అనంతరం క్యాపిటల్ గూడ్స్ రంగంలో పెద్ద ఆర్డర్లు ఉండొచ్చని తద్వారా ఆయా కంపెనీల స్టాక్స్ లాభసాటిగా ఉండొచ్చని బ్రోకింగ్ నిపుణులు భావిస్తున్నారు . 
 
Image result for capital goods stocksMost Popular