క్రాష్ అవుతున్నా.. జెట్ ఎయిర్‌వేస్‌ను అంతమంది కొన్నారా!! 

క్రాష్ అవుతున్నా.. జెట్ ఎయిర్‌వేస్‌ను అంతమంది కొన్నారా!! 

కంపెనీ కుప్పకూలబోతుందని తెలుస్తూనే ఉంది... రుణ దాతలు , బ్యాంకుల కన్సార్టియం చేతులెత్తేసేలా ప్రవర్తిస్తూనే ఉన్నాయి. అయినా దేశీ స్టాక్ ఇన్వెస్టర్లకు ఎక్కడో ఓ మూల చిన్న ఆశ. ఎదో ఒక అద్భుతం జరగకపోదా..అన్న నమ్మకం. కానీ ఇవేవీ వారి ఆశలను నిలబెట్టలేక పోయాయి. జెట్ ఎయిర్ వేస్‌ స్టాక్స్‌ను  గత 6 నెలలుగా దాదాపు 10,000 మందికి పైగా కొన్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. జెట్ అధినేత నరేష్ గోయెల్ ఎదో ఒకటి చేసి సంస్థను గట్టెక్కిస్తాడన్న భావన రిటైల్ ఇన్వెస్టర్లలో ఉండిపోయింది.

Image result for jet airways fallen

దాంతో జెట్ స్టాక్స్ పడుతున్నా కూడా చాలా మంది వాటిని కొని ఇప్పుడు లబోదిబో అంటున్నారు. అప్పటికే 9.82శాతం ఉన్న తమ స్టాక్స్‌ను 11.42శాతానికి పెంచారు రిటైల్ ఇన్వెస్టర్లు.  
గత వారం కొత్త రుణ దాతలెవరూ ముందుకు రాక పోవడంతో లిక్విడిటీ సమస్యలతో జెట్ పూర్తిగా మూత పడినట్టు ఆ సంస్థ ప్రకటించింది. గతంలో కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ కు జరిగిన విధంగానే భారీ ఎత్తున షేర్లను కొంటూ పోయారు ఇన్వెస్టర్లు. జెట్ ఎయిర్ వేస్‌లో  దాదాపు 11,680 మంది రిటైల్ ఇన్వెస్టర్లు గత 6 నెలలుగా తమ స్టాక్స్ ను  పెంచుకుంటూ పోయారు. 2018 డిసెంబర్ 31 నాటికి జెట్ ఎయిర్‌వేస్‌కు  రూ. 7,299 కోట్ల అప్పులు ఉన్నాయి. అవి ఇప్పుడు రూ. 13,980 కోట్లకు పైగా చేరుకున్నాయి. జెట్ విమాన యాన సంస్థలో ప్రయాణాన్ని కాన్య్సిల్ చేసుకున్న వారికి తిరిగి ఇవ్వాల్సిన రిఫండే రూ. 3000 కోట్లకు పైగా ఉంది. కాగా గత గురువారం నాడు జెట్ ఎయిర్ వేస్ స్టాక్స్ దాదాపు 31.08శాతం నష్టపోయాయి. ఒక్కో షేర్ రూ. 165.75 చొప్పున ట్రేడ్ అయింది. ఇలాంటి నిలిపి వేసిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టకూడదని, ఏ సమయంలోనైనా ఇవి తిరిగి పుంజుకునే అవకాశాలు మృగ్యం కాబట్టి ఇలాంటి స్టాక్స్ ను వదిలేసుకోడమే ఉత్తమమని ఏంజిల్ బ్రోకింగ్ కంపెనీ అభిప్రాయపడింది.

Image result for jet airways fallen

జెట్ కంపెనీలో స్టాక్స్ కొనడం అంటే మూతపడిన కింగ్‌ఫిషర్‌ నుండి కూడా లాభాలు సంపాదించడానికి యత్నించినట్లుగా కనబడతోందని ఏంజిల్ సంస్థ పేర్కొంది. జెట్ మూత పడింది, అయినా కూడా ఇన్వెస్టర్లు వీటి మీద జూదం అడటం కరెక్ట్ కాదని ప్రముఖ బ్రోకింగ్ కంపెనీలు అంటున్నాయి. అవగాహన లేని రిటైల్ ఇన్వెస్టర్లు జెట్ స్టాక్స్ రేట్ తగ్గి ఉండటం వల్ల అవి ముందు ముందు లాభాలు తీసుకొస్తాయని పొరపడతున్నారనుకోవచ్చని మోతీలాల్ ఓశ్వాల్ వెల్త్ మేనేజ్ మెంట్ వాఖ్యానించింది. ఏది ఏమైనా ఇక జెట్ స్టాక్స్ విషయంలో తిరిగి రాబట్టుకోడానికి ఏం లేదని మదుపర్లు తెలుసుకోవాలని వెల్త్ మేనేజ్ మెంట్ సంస్థలు తేల్చి చెబుతున్నాయి. "లేదు ..మేం ఇంకా జెట్ స్టాక్స్ కొంటామని మీరంటారా..? గుడ్ ఆ స్టాక్స్ కాగితం ఇప్పుడు మీకొక లాటరీ టిక్కెట్‌గానే మీరు భావించాల్సి ఉంటుంద"ని మోతీలాల్ ఓశ్వాల్ అంటోంది. 

Image result for jet airways fallen



Most Popular