2 కోట్ల మందికి ఇన్‌కం ట్యాక్స్ నోటీసులు! లిస్ట్‌లో మీ పేరుందా?

2 కోట్ల మందికి ఇన్‌కం ట్యాక్స్ నోటీసులు! లిస్ట్‌లో మీ పేరుందా?

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ (CBDT)...  దేశంలో ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్  చేయనివారు, రిటర్న్స్ ఫైల్‌ చేయకుండా డ్రాప్‌ అయిన వారి లెక్కలను తీసింది. ఈ సర్వేలో విస్తుబోయే అంశాలు వెల్లడయ్యాయి. దేశం మొత్తం మీద ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్‌ చేయనివారు, డ్రాపర్స్  అంతా కలిపి సుమారు రెండున్నర కోట్ల మంది ఉన్నారని వెల్లడైంది. దీంతో CBDT,  ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌ వారికి ఆదేశాలను జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం రిటర్న్స్ ఫైల్ చేయనివారందరికీ నోటీసులు పంపాల్సిందిగా సెంట్రల్ బోర్డ్ పేర్కొంది. ఆదాయపు శాఖ దగ్గరున్న నాన్ ఫైలింగ్ మానిటరింగ్ సిస్టమ్ (NMS) డాటా ప్రకారం 2013 నుండి 2017 మధ్య కాలంలో..  దేశంలో 20.4 మిలియన్స్ మంది(2 కోట్ల 4 లక్షల మంది )  ట్యాక్స్ రిటర్న్స్ చేయడంలో విఫలమయ్యారని, లేదా నిర్ణీత సమయానికి వారు ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ చేయలేదని వెల్లడైంది.  వీరిలో సుమారు 20.5 లక్షల మంది తమ ఇన్‌కం ట్యాక్స్ వివరాలను వెల్లడించకుండా డ్రాపర్స్ గా మిగిలిపోయిన వారు ఉన్నారని NMS డాటా పేర్కొంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ ఆదేశాల మేరకు దేశ వ్యాప్తంగా నాన్ ఫైలర్స్ , డ్రాపర్స్ కు నోటీసులు పంపబోతున్నామని, నోటీసులకు తగిన సమాధానాలు రాక పోతే ప్రొసీడింగ్స్ కు వెళ్తామని ఆదాయపు పన్ను వర్గాలు అంటున్నాయి. 
chart
ఇన్‌కం ట్యాక్స్ యాక్ట్ చట్టం సెక్షన్ 271F ప్రకారం ట్యాక్స్ నాన్ ఫైలింగ్‌ కింద పెనాల్టీ విధించబడుతుంది. మరియు లేట్ ఫైలింగ్ కింద సెక్షన్ 234 ప్రకారం ఆగస్ట్ 31లోపు తమ ఆదాయపు వివరాలను వెల్లడించాలి . ఒక వేళ వారు ఆలస్యంగా పన్ను రిటర్న్స్ సమర్పిస్తే... దానికి గాను రూ. 5,000 పెనాల్టీగా చెల్లించాల్సి ఉంటుంది (డిసెంబర్ 31 లోపు ) . డిసెంబర్ 31 తరువాత ట్యాక్స్ ఫైలింగ్ చేస్తే.. రూ. 10,000 జరిమానాగా ఇన్‌కం ట్యాక్స్ చట్టాలు చెబుతున్నాయి. అయితే ఇందులో మినహాయింపులు కూడా ఉన్నాయి. సాలీనా రూ. 5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారైతే గనుక  మాగ్జిమమ్ పెనాల్టీ రూ. 1000 వరకే ఉంటుందని ఆదాయపు శాఖ వర్గాలు పేర్కొన్నాయి. 
Image result for IT RETURNS FILING
దేశంలో ట్యాక్స్ కట్టే వారి పరిధి పెంచడానికి తగు చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగానే NMS డేటా బేస్‌ నుండి ట్యాక్స్ రిటర్న్స్ చేయని వారు, డ్రాపర్స్ లిస్ట్ తయారు చేసామని ఇన్‌కం ట్యాక్స్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ NMS డాటాను దేశ వ్యాప్తంగా ఉన్న ఆదాయపు పన్ను శాఖ అధికారులకు పంపుతున్నామని ఆ డాటా ప్రకారం  నోటీసులు జారీ చేస్తున్నామని వారు అంటున్నారు. 
Image result for IT RETURNS FILING
2013 నుండి గతంలో ఇన్‌కం ట్యాక్స్ కట్టి, డ్రాప్‌ అయిన వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోందని, 2014లో వీరి సంఖ్య 12.2 లక్షల మందిగా ఉంటే.. అది 2015 నాటికి ట్యాక్స్ ఎగవేత దారుల సంఖ్య 60.7 లక్షలకు చేరిందని ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. కాగా ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ డ్రాపర్స్ విషయంలో 2017 ఆర్ధిక సంవత్సరంలో వీరి సంఖ్య 2.83 మిలియన్స్‌గా ఉండగా , 2018 ఆర్ధిక సంవత్సరం నాటికి డ్రాపర్స్ సంఖ్య 2.5 మిలియన్స్ గా ఉంది. 
 Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');