విప్రో బైబ్యాక్‌లో షేర్లు తిరిగి ఇచ్చేస్తే బెస్ట్ !! ఎందుకంటే

విప్రో బైబ్యాక్‌లో షేర్లు తిరిగి ఇచ్చేస్తే బెస్ట్ !! ఎందుకంటే

విప్రో త్రైమాసిక ఫలితాలు మార్కెట్ అంచనాల కంటే మెరుగ్గానే ఉన్నాయి. ప్రాఫిటబులిటీ సహా డిజిటల్ రెవెన్యూల విషయంలో పనితీరును మెరుగుపర్చుకుంది.     క్యాష్ ఫ్లో నిర్వాహణ కూడా మెరుగ్గానే ఉన్నట్టు రూ.10500 కోట్ల బైబ్యాక్ ప్రకటనతో అర్థమవుతోంది. షేర్ హోల్డర్లతో నమ్మకాన్ని మరింతగా పాదుగొల్పేందుకు బోర్డ్ ఈ నిర్ణయం తీసుకుంది. 

అయితే ఇవేవీ విప్రోపై పటిష్టమైన నమ్మకాన్ని కలిగించడంలేదు. ఎందుకంటే రెవెన్యూ వృద్ధి పరంగా అంత గొప్ప ప్రదర్శనను విప్రో కనబర్చడం లేదు. 2008-09 నాటి స్థాయిలకు వృద్ధి పడిపోతోంది. 

7 ఏళ్ల నుంచి అంతంతమాత్రమే

రెవెన్యూ కేవలం 3.8 శాతం మాత్రమే పెరిగింది. అంతకు ముందు ఏడాది ఇది 4.3 శాతంగా ఉంది. గత ఏడేళ్లుగా వృద్ధి సింగిల్ డిజిట్‌కు మాత్రమే పరిమితమైంది. 2012లో మాత్రమే సంస్థ 13.4 శాతం వృద్ధిని నమోదు చేసింది. మళ్లీ ఇప్పటివరకూ అలాంటి దాఖలాలే లేవు. ఆ సమయంలో టీసీఎస్, హెచ్ సి ఎల్ టెక్ సంస్థలు అద్దిరిపోయే రిజల్ట్స్‌ను అనౌన్స్ చేశాయి. 

డాలర్ టర్మ్స్‌లో గత ఐదేళ్ల కాంపౌండ్ గ్రోత్‌ను విశ్లేషిస్తే టీసీఎస్ (9.2 శాతం) - ఇన్ఫోసిస్ (7.4 శాతం) టాప్ లైన్ పెరిగితే, విప్రో కేవలం 4.2 శాతం మాత్రమే పెరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో విప్రో భవిష్యత్ అంచనాలు కూడా అంత గొప్పగా కనిపించడం లేదు. 

వదిలించుకోవడం బెస్ట్ !

అందుకే రూ.325కి కంపెనీ ఇచ్చిన బైబ్యాక్ ఆఫర్‌కు షేర్లను టెండర్ చేయడమే బెస్ట్ అనేది మార్కెట్ నిపుణుల సలహా. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ధరతో పోలిస్తే 15.7 శాతం అధికంగా ధరను నిర్ణయించింది విప్రో. ఒక వేళ షేర్లు టెండర్ చేసి మనకు వస్తే.. మంచి లాభాలతో బయట పడ్టట్లే లెక్క అనేది ఎక్స్‌పర్ట్స్ ఎడ్వైజ్. Most Popular