సెన్సెక్స్.. నిఫ్టీ- రేసు గుర్రాలు

సెన్సెక్స్.. నిఫ్టీ- రేసు గుర్రాలు

ఈ ఏడాది వర్షపాతం 96% సాధారణ సగటును అందుకోవచ్చునంటూ వాతావరణ శాఖ వేసిన అంచనాలు వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లకు జోష్‌నిస్తున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో అటు నిఫ్టీ, ఇటు సెన్సెక్స్‌ సరికొత్త రికార్డులను సాధించాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే నిఫ్టీ గత గరిష్ట రికార్డ్‌ 11,761ను అధిగమించగా.. తదుపరి సెన్సెక్స్‌ సైతం 39,270ను దాటేసింది. వెరసి రెండు ఇండెక్సులూ ఇంట్రాడేలో సరికొత్త గరిష్టాలను సాధించాయి. ఎల్‌నినో పరిస్థితులు బలహీనపడనున్న కారణంగా దీర్ఘకాలిక సగటుతో పోలిస్తే 96 శాతం వర్షాలకు చాన్స్‌ ఉన్నదంటూ ఐఎండీ అభిప్రాయపడటంతో సెంటిమెంటుకు బలమొచ్చినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం సెన్సెక్స్‌ లాభాల ట్రిపుల్‌ సెంచరీ చేసింది. 340 పాయింట్లు జంప్‌చేసి 39,246కు చేరింది. ఇక నిఫ్టీ 93 పాయింట్లు ఎగసి 11,783 వద్ద ట్రేడవుతోంది. తొలుత సెన్సెక్స్‌ 39,278ను తాకగా.. నిఫ్టీ 11,787కు చేరింది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలు కావడం విశేషం! 

రియల్టీ మినహా
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడగా.. రియల్టీ 0.8 శాతం నీరసించింది. మిగిలిన ప్రధాన రంగాలన్ని 1-0.5 శాతం మధ్య బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐసీఐసీఐ, టైటన్‌, ఇండస్‌ఇండ్, ఏషియన్‌ పెయింట్స్‌, ఐబీ హౌసింగ్‌, హిందాల్కో, ఇన్ఫ్రాటెల్‌, ఎల్‌అండ్‌టీ, టీసీఎస్‌, మారుతీ 3-1.5 శాతం మధ్య ఎగశాయి. బ్లూచిప్స్‌లో కేవలం టాటా మోటార్స్‌, సిప్లా, ఇన్ఫోసిస్‌, ఎయిర్‌టెల్‌, బీపీసీఎల్‌ 2-0.5 శాతం మధ్య క్షీణించాయి. రియల్టీ స్టాక్స్‌లో ఒబెరాయ్‌, సన్‌టెక్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, ఇండియాబుల్స్‌, బ్రిగేడ్ 3-0.5 శాతం మధ్య నష్టపోయాయి.

పీసీ జ్యవెలర్స్‌ జూమ్‌
డెరివేటివ్స్‌ విభాగంలో పీసీ జ్యవెలర్స్‌ 15 శాతం దూసుకెళ్లగా.. దివాన్‌ హౌసింగ్‌, డీసీబీ బ్యాంక్‌, టొరంట్‌ పవర్‌, రిలయన్స్ ఇన్‌ఫ్రా, టీవీఎస్‌ మోటార్‌, భారత్ ఫైనాన్స్‌ 4-2.25 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు జెట్‌ ఎయిర్‌వేస్‌, అలహాబాద్‌ బ్యాంక్‌, ఇన్‌ఫీబీమ్‌, టీవీ 18, ఇంజినీర్స్‌ ఇండియా, ఒరాకిల్‌ ఫైనాన్స్, మ్యాక్స్‌ ఫైనాన్స్‌, అపోలో టైర్‌ 3.4-1 శాతం మధ్య వెనకడుగు వేశాయి.

చిన్న షేర్లు గుడ్
మార్కెట్లు హుషారుగా కదులుతున్న నేపథ్యంలో చిన్న షేర్లకూ డిమాండ్‌ కనిపిస్తోంది. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.3 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1178 లాభపడగా 990 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. స్మాల్‌ క్యాప్స్‌లో మహాబ్యాంక్‌, 8కే మైల్స్‌, స్పైస్‌జెట్‌, దీపక్‌ ఫెర్టిలైజర్స్‌, సెయింట్‌ గొబైన్‌, స్పైస్‌జెట్‌, గతి, గ్రావిటా, ఆర్‌పీపీ, రుషిల్‌, టాటా భూషణ్‌, 63 మూన్స్‌, తాన్లా, కాస్మో ఫిల్మ్స్‌, జిందాల్‌ సా, శిల్పామెడి తదితరాలు 10-4 శాతం మధ్య జంప్‌చేశాయి.Most Popular