ఫుడ్స్‌ అండ్‌ ఇన్స్‌ -లాభాల జ్యూస్‌

ఫుడ్స్‌ అండ్‌ ఇన్స్‌ -లాభాల జ్యూస్‌

సంపన్న వర్గాలకు చెందిన ఇన్వెస్టర్లు(HNIs) కంపెనీలో వాటాలు కొనుగోలు చేసినట్లు వెల్లడికావడంతో ఫుడ్స్‌ అండ్‌ ఇన్స్‌ లిమిటెడ్‌ కౌంటర్‌ వరుసగా రెండో రోజు జోరందుకుంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో మరోసారి అప్పర్‌ సర్క్యూట్‌ తాకింది. ఇప్పటికే ఆర్‌కే దమానీకి చెందిన డిరైవ్‌ ఇన్వెస్ట్‌మెంట్ ఫుడ్స్‌ అండ్‌ ఇన్స్‌ షేర్లను కొనుగోలు చేసినట్లు వెల్లడికాగా.. తాజాగా మహేంద్ర కుమార్‌ కంపెనీలో ఇన్వెస్ట్‌ చేసినట్లు  బీఎస్‌ఈ డేటా వెల్లడించింది. దీంతో ఫుడ్స్‌ అండ్‌ ఇన్స్‌ కౌంటర్లో అంతా కొనేవాళ్లే తప్ప అమ్మేవాళ్లు కరవయ్యారు. ఫలితంగా రెండో రోజూ 20 శాతం సర్క్యూట్‌ను బ్రేకర్‌ను తాకింది. వివరాలు చూద్దాం..

రెండు రోజుల్లో 40 శాతం
ట్రాపికల్‌ ఫ్రూట్స్‌ పల్ప్స్‌, ప్యూరీస్‌, వెజిటబుల్స్‌ తయారీ, ఎగుమతుల సంస్థ ఫుడ్స్‌ అండ్‌ ఇన్స్‌ లిమిటెడ్‌కు చెందిన 1.21 లక్షల షేర్లను మహేంద్ర కుమార్‌ కొనుగోలు చేశారు. ఈ నెల 12న షేరుకి రూ. 222.87 ధరలో వీటిని రూ. 2.7 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్నారు. కాగా.. గురువారం(11న) డిరైవ్‌ ఇన్వెస్ట్‌మెంట్ 7.92 లక్షల షేర్లను కొనుగోలు చేసినట్లు బీఎస్‌ఈ డేటా వెల్లడించింది. కంపెనీ ఈక్విటీలో 4.72 శాతం వాటాకు సమానమైన వీటిని షేరుకి రూ. 184 సగటు ధరలో బ్లాక్‌డీల్‌ ద్వారా డిరైవ్‌ సొంతం చేసుకుంది. ఇందుకు దాదాపు 14.6 కోట్లు వెచ్చించింది. ఈ నేపథ్యంలో ఫుడ్స్‌ అండ్‌ ఇన్స్‌ షేరు బీఎస్‌ఈలో తొలుత 20 శాతం దూసుకెళ్లి రూ. 268 సమీపానికి చేరింది. ఇది సరికొత్త గరిష్టం కాగా.. ప్రస్తుతం 17.5 శాతం జంప్‌చేసి రూ. 262 వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం సైతం ఈ షేరు 20 శాతం  దూసుకెళ్లి రూ. 223 వద్ద ఫ్రీజైన సంగతి తెలిసిందే. వాటాదారులకు బోనస్‌ షేర్లను ప్రకటించాక ఈ కౌంటర్ గత నెల రోజుల్లో 60 శాతం ర్యాలీ చేయడం విశేషం!Most Popular