టామో.. అదుర్స్‌- టీవీ 18 బోర్లా

టామో.. అదుర్స్‌- టీవీ 18 బోర్లా

కొద్ది రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న ఆటో రంగ దేశీ దిగ్గజం టాటా మోటార్స్‌ కౌంటర్‌ మరోసారి ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ షేరు భారీ లాభాలతో సందడి చేస్తోంది. కాగా.. మరోపక్క గత ఆర్థిక సంవత్సరం(2018-19) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించినప్పటికీ మీడియా సంస్థ టీవీ18 బ్రాడ్‌క్యాస్ట్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో ఈ షేరు కళతప్పింది. ఇతర వివరాలు చూద్దాం.. 

టాటా మోటార్స్‌
ఆటో రంగ ఇండెక్స్‌ త్వరలో జోరందుకోనున్నట్లు రీసెర్చ్‌ సంస్థ నార్నోలియా ఫైనాన్షియల్‌ అడ్వయిజర్స్‌ తాజాగా అంచనా వేసింది. దీంతో ఇన్వెస్టర్లు ఈ రంగంలో పెట్టుబడులు చేపట్టవచ్చునని సిఫారసు చేస్తోంది. దీనిలో భాగంగా టాటా గ్రూప్‌ దిగ్గజం టాటా మోటార్స్‌ కౌంటర్‌లో కొనుగోలుకు సిఫారసు చేస్తోంది. ఇందుకు రూ. 274 టార్గెట్‌ ధరను ప్రకటించింది. రూ. 200 ధరవద్ద టాటా మోటార్స్‌ షేరు బ్రేకవుట్‌ సాధించినట్లు నార్నోలియా అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో టాటా మోటార్స్‌ షేరు దాదాపు 6 శాతం దూసుకెళ్లి రూ. 229 వద్ద ట్రేడవుతోంది. గత ఐదు రోజుల్లోనూ ఈ కౌంటర్‌ నాలుగురోజులు లాభపడింది. 14 శాతం ర్యాలీ చేసింది.

Image result for tv18 broadcast

టీవీ18 బ్రాడ్‌క్యాస్ట్‌
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)కి టీవీ18 బ్రాడ్‌క్యాస్ట్‌ ఆకర్షణీయ ఫలితాలు విడుదల చేసింది. నికర లాభం రూ. 3 కోట్ల నుంచి రూ. 28 కోట్లకు జంప్‌చేసింది. మొత్తం ఆదాయం 56 శాతం ఎగసి రూ. 1181 కోట్లను అధిగమించింది. ఇబిటా 14 శాతం పెరిగి రూ. 52 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడటంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో టీవీ18 షేరు 5.2 శాతం పతనమై రూ. 37 దిగువన ట్రేడవుతోంది.Most Popular