పీసీ జ్యువెలర్స్‌-4 రోజుల్లో 41%

పీసీ జ్యువెలర్స్‌-4 రోజుల్లో 41%

విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్(ఎఫ్‌పీఐ) కంపెనీలో వాటా కొనుగోలు చేసినట్లు వెల్లడయ్యాక జోరందుకున్న పీసీ జ్యువెలర్స్‌ కౌంటర్‌ మరోసారి వెలుగులో నిలుస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 11 శాతంపైగా దూసుకెళ్లి రూ. 124 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 127ను సైతం అధిగమించింది. ఇది 2018 జులై తదుపరి గరిష్టంకావడం గమనార్హం! కాగా.. శుక్రవారం సైతం ఈ కౌంటర్‌ 17 శాతం జంప్‌చేసిన విషయం విదితమే. ఇతర వివరాలు చూద్దాం..

కార్లినా కన్ను
ఎఫ్‌పీఐ సంస్థ కార్లినా ఓపెన్‌ మార్కెట్ ద్వారా కంపెనీలో 2 శాతానికిపైగా వాటాను కొనుగోలు చేసినట్లు పీసీ జ్యువెలర్స్‌ తాజాగా పేర్కొంది. ఈ నెల 10న 0.94 శాతం వాటాకు సమానమైన 3.7 మిలియన్‌ పీసీ జ్యువెలర్స్‌ షేర్లను కార్లినా సొంతం చేసుకుంది. వీటిని షేరుకి రూ. 94.68 ధరలో కొనుగోలు చేయగా.. తిరిగి 12న 1.2 శాతం వాటాకు సమానమైన 4.65 మిలియన్‌ షేర్లను కొనుగోలు చేసింది. ఇందుకు షేరుకి రూ. 105.73 ధరలో రూ. 49 కోట్లు వెచ్చించింది.

లాభాల మెరుపులు 
2018లో పీసీ జ్యువెలర్స్‌ షేరు 81 శాతం కుప్పకూలింది. కాగా.. గత నాలుగు రోజులుగా ఈ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. దీంతో గత నాలుగు రోజుల్లోనే ఈ షేరు 41 శాతం జంప్‌చేసింది. ఈ నెల 9న నమోదైన రూ. 91 నుంచి తాజాగా రూ. 125కు ఎగసింది. Most Popular