ఖుషీఖుషీగా కాస్మో ఫిల్మ్స్‌- జిలెట్‌ జోరు

ఖుషీఖుషీగా కాస్మో ఫిల్మ్స్‌- జిలెట్‌ జోరు

ప్యాకేజింగ్‌, ల్యామినేషన్‌ తదితర పరిశ్రమల్లో వినియోగించగల ప్యాకేజింగ్‌ ఫిల్ముల తయారీ సంస్థ కాస్మో ఫిల్మ్స్‌ తాజాగా కొత్త ప్రొడక్టును విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. గరిష్టస్థాయి మాయిశ్చర్‌, ఆక్సిజన్‌, వేడిమి తట్టుకోగల క్యాస్ట్‌ పాలీప్రొపిలీన్(సీపీపీ) ఫిల్మును రూపొందించినట్లు పేర్కొంది. తద్వారా ప్యాకేజింగ్‌ మెషీన్లు అత్యంత వేగవంతంగా సీలింగ్‌ను నిర్వహించేందుకు వీలుంటుందని తెలియజేసింది. ప్రధానంగా ఆహారం, వ్యవసాయ సంబంధ ప్రొడక్టుల తయారీలో దేశీయంగా ఈ ఫిల్ముల వినియోగం ఊపందుకునే వీలున్నట్లు కాస్మో ఫిల్మ్స్‌ పేర్కొంది. బిస్కట్లు, కుకీస్‌, స్నాక్స్‌, చాకొలెట్స్‌, ఐస్‌క్రీమ్స్‌ తదితర ప్రొడక్టుల ప్యాకేజింగ్‌లో ఫిల్ము పనితీరును పరిశీలించినట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో కాస్మో ఫిల్మ్స్‌ షేరు 7 శాతం జంప్‌చేసి రూ. 211 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 217 వరకూ ఎగసింది. కంపెనీలో ప్రస్తుతం ప్రమోటర్లకు 43.98% వాటా ఉంది.

Related image

జిల్లెట్‌ ఇండియా రికార్డ్‌
ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం జిల్లెట్‌ ఇండియా కౌంటర్‌ వరుసగా రెండో రోజు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 7656 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో ఈ షేరు 7 శాతం దూసుకెళ్లి రూ. 7674ను అధిగమించింది. ఇది సరికొత్త గరిష్టంకావడం గమనార్హం!Most Popular