స్పైస్‌జెట్‌- అపోలో ట్యూబ్స్‌ జూమ్‌

స్పైస్‌జెట్‌- అపోలో ట్యూబ్స్‌ జూమ్‌

కొత్తగా అంతర్జాతీయ రూట్లలో వైమానిక సర్వీసులను ప్రారంభించనున్నట్లు వెల్లడించడంతో చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ లిమిటెడ్‌ కౌంటర్‌ జోరందుకుంది. కాగా.. మరోపక్క శంకర బిల్డింగ్‌ ప్రొడక్ట్స్‌ నుంచి ట్యూబ్‌ తయారీ యూనిట్‌ను కొనుగోలు చేయనున్నట్లు తెలియజేయడంతో ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌ కౌంటర్‌ సైతం వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ లాభాలతో సందడి చేస్తున్నాయి. ఇతర వివరాలు చూద్దాం....

స్పైస్‌జెట్‌ లిమిటెడ్‌
పలు విదేశీ ప్రాంతాలకు ముంబై నుంచి డైరెక్ట్‌ సర్వీసులను ప్రవేశపెట్టనున్నట్లు  స్పైస్‌జెట్‌ లిమిటెడ్‌ తాజాగా వెల్లడించింది. ముంబై నుంచి హాంకాంగ్‌, జెడ్డా, దుబాయ్‌, బ్యాంకాక్‌ తదితర పలు అంతర్జాతీయ ప్రాంతాలకు డైరెక్ట్‌ ఫ్లయిట్స్‌ ద్వారా కనెక్టివిటీని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. తద్వారా మే చివరి నుంచి ఆయా ప్రాంతాలకు నాన్‌స్టాప్‌ సర్వీసులను ప్రారంభించనున్నట్లు తెలియజేసింది. ఇందుకు బోయింగ్‌ 737 ఎన్‌జీ విమానాలను వినియోగించనున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బీఎస్ఈలో స్పైస్‌జెట్‌ షేరు దాదాపు 7 శాతం జంప్‌చేసి రూ. 117 వద్ద ట్రేడవుతోంది. 

Image result for apl apollo tubes ltd

ఏపీఎల్‌ అపోలో
శంకర బిల్డింగ్‌ ప్రొడక్ట్స్‌ సంస్థ నుంచి 2 లక్షల ఎంటీపీఏ సామర్థ్యంగల ట్యూబ్‌ తయారీ యూనిట్లను కొనుగోలు చేయనున్నట్లు ఏపీఎల్‌ అపోలో ట్యూబ్‌ పేర్కొంది. ఇందుకు రూ. 70 కోట్లు వెచ్చించనున్నట్లు తెలియజేసింది. జీఐ, జీపీ పైపుల తయారీ ఈ యూనిట్‌ను సొంతం చేసుకునేందుకు శంకరతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఏపీఎల్‌ వివరించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఏపీఎల్‌ అపోలో షేరు 3.2 శాతం పెరిగి రూ. 1504 వద్ద ట్రేడవుతోంది. శంకర బిల్డ్‌ ప్రో షేరు 0.6 శాతం బలపడి రూ. 541 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 555 వరకూ ఎగసింది.



Most Popular