క్యూ4 -టీసీ..యస్‌- ఇన్ఫీ డీలా

క్యూ4 -టీసీ..యస్‌- ఇన్ఫీ డీలా

గత ఆర్థిక సంవత్సరం(2018-19) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించిన దేశీ సాఫ్ట్‌వేర్‌ రంగ దిగ్గజ కంపెనీలపట్ల ఇన్వెస్టర్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. టాటా గ్రూప్‌ దిగ్గజం టీసీఎస్‌ కౌంటర్‌లో కొనుగోళ్లు ఊపందుకోగా.. ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌ కౌంటర్లో అమ్మకాలు నమోదవుతున్నాయి. ఫలితంగా ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో టీసీఎస్‌ షేరు 2 శాతం పెరిగి రూ. 2055 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 2088 వరకూ ఎగసింది. అయితే మరోపక్క ఇన్ఫోసిస్‌ షేరు దాదాపు 3 శాతం పతనమైంది. రూ. 727 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 713 దిగువకు క్షీణించింది. ఫలితాల వివరాలు చూద్దాం...

టీసీఎస్‌
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో టీసీఎస్‌ రూ. 8126 కోట్ల నికర లాభం ఆర్జించింది. త్రైమాసిక ప్రాతిపదికన ఇది నామమాత్ర వృద్ధికాగా.. మొత్తం ఆదాయం దాదాపు 2 శాతం పెరిగి రూ. 38,000 కోట్లను అధిగమించింది. 25.1 శాతం నిర్వహణ లాభం(ఇబిటా) మార్జిన్లు సాధించింది.

ఇన్ఫోసిస్‌
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ఇన్ఫోసిస్‌ రూ. 4074 కోట్ల నికర లాభం ఆర్జించింది. త్రైమాసిక ప్రాతిపదికన ఇది 13 శాతం వృద్ధికాగా.. మొత్తం ఆదాయం మాత్రం నామమాత్రంగా పెరిగి రూ. 21,530 కోట్లను అధిగమించింది. నిర్వహణ లాభాల మార్జిన్లు 22.57 శాతం నుంచి 21.4 శాతానికి తగ్గాయి. వాటాదారులకు ఒక్కో షేరుకీ రూ. 10.50 చొప్పున తుది డివిడెండ్‌ చెల్లించనుంది. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం(2019-20)లో కరెన్సీలో నిలకడ ఆధారంగా ఆదాయం 7.5-9.5 శాతం స్థాయిలో పుంజుకోవచ్చని కంపెనీ అంచనా(గైడెన్స్‌) ప్రకటించింది. ఇబిటా మార్జిన్లు 21-23 శాతం మధ్య సాధించగలమని భావిస్తోంది.Most Popular