లాభాలతో షురూ- అన్ని రంగాలూ!

లాభాలతో షురూ- అన్ని రంగాలూ!

ప్రోత్సాహకర ప్రపంచ సంకేతాల నడుమ దేశీ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 71 పాయింట్లు బలపడి 38,838కు చేరగా.. నిఫ్టీ 26 పాయింట్ల లాభంతో 11,670 వద్ద ట్రేడవుతోంది. బ్యాంకింగ్‌, ఇతర బ్లూచిప్స్‌ అండతో శుక్రవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు లాభపడగా.. యూరోపియన్‌ మార్కెట్లు సైతం సానుకూలంగా ముగిశాయి. ప్రస్తుతం ఆసియాలోనూ మార్కెట్లు ఉత్సాహంగా కదులుతున్నాయి. కాగా.. సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్‌ ప్రారంభమైన నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.

మెటల్, రియల్టీ ప్లస్‌లో 
న్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడగా.. మెటల్‌, రియల్టీ, ఆటో 1.3-0.5 శాతం మధ్య పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో టాటా మోటార్స్‌, టీసీఎస్‌, కోల్‌ ఇండియా, హిందాల్కో, టెక్‌ మహీంద్రా, హీరోమోటో, ఐవోసీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, వేదాంతా, టాటా స్టీల్‌ 3.5-1 శాతం మధ్య ఎగశాయి. అయితే ఇన్ఫోసిస్‌ 3.5 శాతం పతనంకాగా, గెయిల్‌ 1.25 క్షీణించింది. రియల్టీ స్టాక్స్‌లో ఒబెరాయ్‌, ఫీనిక్స్‌, ఇండియాబుల్స్‌, బ్రిగేడ్‌, ప్రెస్టేజ్‌ 3-1 శాతం మధ్య లాభపడ్డాయి.

ఎఫ్‌అండ్‌వో ఇలా
డెరివేటివ్స్‌ విభాగంలో సుజ్లాన్‌, పీసీ జ్యవెలర్స్‌, ఇన్ఫీబీమ్‌, ఇండిగో, జీఎంఆర్ 6-2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు అదానీ పవర్, టాటా పవర్‌, ఎల్‌ఐసీ ఫైనాన్స్, ఆర్‌ఈసీ, యూబీఎల్‌, లుపిన్‌, గ్లెన్‌మార్క్‌ 3.5-0.6 శాతం మధ్య వెనకడుగు వేశాయి.

చిన్న షేర్లు ఓకే
మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమైన నేపథ్యంలో చిన్నస్థాయి షేర్లకూ డిమాండ్‌ కనిపిస్తోంది. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.35-0.5 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 845 లాభపడగా 410 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. స్మాల్‌ క్యాప్స్‌లో 63 మూన్స్‌, రెయిన్‌, స్యూబెక్స్‌, గ్యూఫిక్‌, స్పైస్‌జెట్‌, జేకే అగ్రి, తంగమాయిల్‌, రెస్పాన్సివ్‌, 8కే మైల్స్‌, పీసీ జ్యువెలర్స్‌, ఆర్‌వోహెచ్‌ఎల్‌, ప్రిజమ్‌ జాన్సన్‌, బటర్‌ఫ్లై తదితరాలు 14-5 శాతం మధ్య జంప్‌చేశాయి.Most Popular