యూ'ఎస్‌- బ్యాంకింగ్ పుష్‌

యూ'ఎస్‌- బ్యాంకింగ్ పుష్‌

ఈ ఏడాది(2019) తొలి క్వార్టర్‌లో అంచనాలను మించిన ఫలితాలు ప్రకటించడం ద్వారా బ్యాంకింగ్‌ దిగ్గజం జేపీ మోర్గాన్‌ చేజ్‌ ఇన్వెస్టర్లకు జోష్‌నిచ్చింది. దీంతో వారాంతాన అమెరికా స్టాక్ మార్కెట్లు తిరిగి జోరందుకున్నాయి. శుక్రవారం డోజోన్స్‌ 251 పాయింట్లు(1 శాతం) జంప్‌చేసి 26,394కు చేరగా.. ఎస్‌అండ్‌పీ 18 పాయింట్లు(0.65 శాతం) పుంజుకుని 2,906 వద్ద నిలిచింది. నాస్‌డాక్‌ సైతం 34 పాయింట్లు(0.43 శాతం) ఎగసి 7,981 వద్ద స్థిరపడింది. వెరసి మార్కెట్లు గతేడాది సెప్టెంబర్‌లో సాధించిన సరికొత్త గరిష్టాలకు చేరువయ్యాయి. ఈ స్థాయిల నుంచి ఎస్‌అండ్‌పీ 1 శాతం, డోజోన్స్‌, నాస్‌డాక్‌ 1.6 శాతం చొప్పున లాభపడితే.. చరిత్రాత్మక గరిష్టాలను అందుకునే వీలుంటుందని విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక మందగమన ఆందోళనలతో ఇటీవల యూఎస్‌ మార్కెట్లు ఆటోపోట్లను చవిచూస్తున్న విషయం విదితమే. 

Image result for JP Morgan chase

ఫలితాల సీజన్‌
క్యూ1లో ఆకట్టుకునే పనితీరు ప్రదర్శించడం ద్వారా జేపీ మోర్గాన్‌ చేజ్‌ ఇతర బ్యాంకింగ్‌ దిగ్గజాలకూ ప్రోత్సాహాన్నిచ్చింది. జేపీ మోర్గాన్‌ షేరు 4.5 శాతం జంప్‌చేసింది. కాగా.. 2016 తదుపరి అతిపెద్ద డీల్‌కు తెరతీస్తూ.. అనడార్కో పెట్రోలియం కార్ప్‌ను 33 బిలియన్‌ డాలర్లకు నగదు రూపేణా కొనుగోలు చేయనున్నట్లు చెవ్రాన్‌ కార్ప్‌ పేర్కొంది. దీంతో చెవ్రాన్‌ షేరు 5 శాతం పతనంకాగా.. అనడార్కో 33 శాతం దూసుకెళ్లింది. స్ట్రీమింగ్‌ సర్వీసులను చౌకగా ప్రారంభించిన నేపథ్యంలో వాల్ట్‌డిస్నీ 11 శాతం జంప్‌చేయగా.. ఈ విభాగంలో ప్రత్యర్ధి సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ 4.5 శాతం పతనమైంది. గత వారం యూఎస్‌ సెనేటర్‌ బెర్నీ శాండర్స్‌ అందరికీ మెడికేర్‌ ప్రతిపాదన తీసుకురావడంతో వరుసగా రెండో రోజు హెల్త్‌కేర్ స్టాక్స్‌ డీలాపడ్డాయి. యునైటెడ్‌ హెల్త్‌ గ్రూప్‌, ఆంథెమ్‌ ఇంక్‌, హ్యూమన్‌ ఇంక్‌ 2-6.5 శాతం మధ్య పతనమయ్యాయి. ఇటీవల డీలాపడిన బోయింగ్‌ కౌంటర్‌లో స్క్వేరప్‌ లావాదేవీల కారణంగా షేరు 2.3 శాతం ఎగసింది.

ఆసియా జూమ్
యూరోపియన్‌ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. యూఏ, ఫ్రాన్స్‌, జర్మనీ 0.25-0.55 శాతం మధ్య పుంజుకున్నాయి. ప్రస్తుతం ఆసియాలో సానుకూల ట్రెండ్‌ కనిపిస్తోంది. జపాన్‌, చైనా, హాంకాంగ్‌, కొరియా, తైవాన్‌ 1.5-0.7 శాతం మధ్య ఎగశాయి. మిగిలిన మార్కెట్లలో సింగపూర్‌, థాయ్‌లాండ్‌ నామమాత్ర లాభాలతో కదులుతుంటే.. ఇండొనేసియా 0.3 శాతం బలపడింది.Most Popular