స్టాక్స్ ఇన్ న్యూస్ (ఏప్రిల్ 15 - 2019)

స్టాక్స్ ఇన్ న్యూస్ (ఏప్రిల్ 15 - 2019)
 • ఇవాళ మార్కెట్లలో లిస్టింగ్ కానున్న మెట్రోపొలిస్ హెల్త్‌కేర్
 • సాధన నైట్రోకెమ్: మధ్యంతర డివిడెండ్‌పై చర్చించేందుకు ఈ నెల 17న బోర్డ్ మీటింగ్
 • బజాజ్ ఫైనాన్స్: ఏప్రిల్15-18 మధ్య సింగపూర్, హాంగ్‌కాంగ్, టోక్యోలలో సంస్థాగత మదుపర్లు, బ్యాంకులతో నాన్-డీల్ రోడ్ షోలో పాల్గొననున్న అధికారులు
 • ఏపీఎల్ అపోలో ట్యూబ్స్: శంకరకు చెందిన తయారీ యూనిట్ కొనుగోలుపై చర్చించేందుకు రేపు ఇన్వెస్టర్లతో బోర్డ్ భేటీ
 • మనప్పురం ఫైనాన్స్: ఏప్రిల్ 16న క్రియేడర్ సుందరం మ్యూచువల్ ఫండ్‌లతో భేటీ కానున్న కంపెనీ అధికారులు
 • జెట్ ఎయిర్‌వేస్: కొనసాగుతున్న జెట్ కష్టాలు, జీతాలు చెల్లించకపోవడంతో సేవలు నిలిపివేయాలని పైలట్ల నిర్ణయం
 • ప్రికాల్: లాంగ్-టెర్మ్ రుణ సదుపాయాలపై బీబీబీ+ స్టేబుల్ నుంచి బీబీబీ నెగిటివ్‌కు రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేసిన ఇక్రా
 • ఐటీఐ లిమిటెడ్: 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,051 కోట్ల టర్నోవర్ నమోదు, గతేడాదితో పోల్చితే 20 శాతం పెరుగుదల
 • సుదర్శన్ కెమికల్ ఇండస్ట్రీస్: IMSD విభాగంలో వాటాను GMM ఫాడ్లర్‌కు డైవెస్ట్ చేసే ప్రతిపాదనకు బోర్డ్ అంగీకారం
 • మెక్‌లాయిడ్ రసెల్: ఫండా టీ కంపెనీలో పూర్తి వాటా విక్రయానికి అనుబంధ సంస్థ బొరెల్లి టీ హోల్డింగ్స్ ఒప్పందం 
 • పెర్సిస్టెంట్ సిస్టమ్స్: సేల్స్, టెక్నాలజీ సర్వీసెస్ యూనిట్‌ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వహిస్తున్న సుధీర్ కులకర్ణి రాజీనామా
 • హెచ్‌టీ మీడియా: షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ ప్రకారం 69.05 లక్షల ఎన్ఆర్ఎల్‌ షేర్లను 2019 నవంబర్ 15లోగా కొనుగోలు
 • ఇంటర్నేషనల్ పేపర్ ఏపీపీఎం: వార్షిక నిర్వహణలో భాగంగా ఏప్రిల్ 15 నుంచి 22 వరకు తూ.గో. జిల్లా కడియంలోని ప్లాంట్‌లో కార్యకలాపాలు నిలిపివేత


Most Popular