రెయిన్‌, పీసీ, వక్రంగీ... జూమ్‌

రెయిన్‌, పీసీ, వక్రంగీ... జూమ్‌

గడిచిన వారం దేశీ స్టాక్‌ మార్కెట్లు పలుమార్లు ఊగిసలాటకు లోనయ్యాయి. ఒక రోజు లాభపడితే.. మరుసటి రోజు డీలాపడ్డాయి. చివరికి స్వల్ప నష్టాలతో నిలిచాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) ప్రపంచ ఆర్థిక వృద్ధి అంచనాలను తగ్గించడంతో కొంతమేర సెంటిమెంటు బలహీనపడినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా.. శుక్రవారం(12)తో ముగిసిన గత వారం సెన్సెక్స్‌ నికరంగా 95 పాయింట్లు క్షీణించి 38,767 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 23 పాయింట్ల వెనకడుగుతో 11,643 వద్ద స్థిరపడింది. ఈ బాటలో బీఎస్ఈలో మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.55 శాతం నష్టపోగా.. స్మాల్‌ క్యాప్‌ 0.16 శాతం నీరసించింది.

విప్రో, ఆటో స్పీడ్‌
బ్లూచిప్‌ స్టాక్స్‌లో విప్రో 8 శాతం జంప్‌చేయగా, బజాజ్‌ ఆటో, టాటా మోటార్స్‌, సిప్లా, ఐటీసీ, హెచ్‌యూఎల్‌, మారుతీ, ఎంఅండ్‌ఎం 5-3 శాతం మధ్య ఎగశాయి. అయితే ఐబీ హౌసింగ్‌ 8 శాతం పతనంకాగా.. ఏషియన్‌ పెయింట్స్‌, ఎయిర్‌టెల్‌, వేదాంతా, బజాజ్‌ ఫైనాన్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, హిందాల్కో, టీసీఎస్‌ 5-2 శాతం మధ్య నష్టపోయాయి.

చిన్న షేర్ల తీరిలా
చిన్న షేర్లలో రెయిన్‌, పీసీ, వక్రంగీ, ఐబీ రియల్టీ, శంకర, జైకార్ప్‌, ఇన్ఫీబీమ్‌, గేట్‌వే, ఆస్ట్రాజెనెకా, ఫస్ట్‌సోర్స్‌, టీవీ18, ఒబెరాయ్‌ రియల్టీ, అశోక్‌ లేలాండ్‌, సుజ్లాన్ తదితరాలు 31-8 శాతం మధ్య దూసుకెళ్లాయి. కాగా.. మరోవైపు ఆర్‌కామ్‌ 22 శాతం కుప్పకూలగా.. పీఎన్‌బీ హౌసింగ్‌, సెంచురీ ప్లై, డీఎల్‌ఎఫ్‌, రిలయన్స్‌ పవర్‌, రాడికో, హెరిటేజ్‌ ఫుడ్స్‌, స్టెరిలైట్‌ టెక్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, ఎడిల్‌వీజ్‌, ఇండోస్టార్‌ కేపిటల్‌, జేపీ, వెల్‌స్పన్‌ కార్ప్, ఫ్యూచర్‌ రిటైల్‌ తదితరాలు 12-6 శాతం మధ్య పతనమయ్యాయి.Most Popular