ఈ వారం ట్రేడింగ్‌ మూడు రోజులే

ఈ వారం ట్రేడింగ్‌ మూడు రోజులే

దేశీ స్టాక్ మార్కెట్లలో ఈ వారం ట్రేడింగ్‌ మూడు రోజులకే పరిమితంకానుంది. అయినప్పటికీ ఫలితాల సీజన్‌, ద్రవ్యోల్బణ గణాంకాలు మార్కెట్లలో యాక్టివిటీని పెంచనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. మహావీర్ జయంతి సందర్భంగా బుధవారం(17న) మార్కెట్లు పనిచేయవు. ఇదే విధంగా శుక్రవారం(19న) గుడ్‌ఫ్రైడే సందర్భంగా మార్కెట్లకు సెలవు ప్రకటించారు. దీంతో సోమ, మంగళ, గురువారాల్లో మాత్రమే ట్రేడింగ్‌ కొనసాగనుంది. కాగా.. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఇప్పటికే తొలి దశ పోలింగ్‌ పూర్తికాగా.. మలిదశ 18న జరగనుంది. Most Popular