ఫలితాలు, ధరలవైపు ఇన్వెస్టర్ల చూపు

ఫలితాలు, ధరలవైపు ఇన్వెస్టర్ల చూపు

ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్‌ మూడు రోజులకే పరిమితంకానుంది. అయినప్పటికీ ఫలితాల సీజన్‌, ద్రవ్యోల్బణ గణాంకాలు మార్కెట్లలో యాక్టివిటీని పెంచనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. మహావీర్ జయంతి సందర్భంగా బుధవారం(17న) మార్కెట్లు పనిచేయవు. ఇదే విధంగా శుక్రవారం(19న) గుడ్‌ఫ్రైడే సందర్భంగా మార్కెట్లకు సెలవు ప్రకటించారు. దీంతో సోమ, మంగళ, గురువారాల్లో మాత్రమే ట్రేడింగ్‌ కొనసాగనుంది. 

ఐటీ దిగ్గజాలతో షురూ
గత ఆర్థిక సంవత్సరం(2018-19) చివరి త్రైమాసిక ఫలితాల సీజన్‌ వారాంతాన ఊపందుకుంది. శుక్రవారం(12న) మార్కెట్లు ముగిశాక సాఫ్ట్‌వేర్‌ సేవల దేశీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్‌ క్యూ4(జనవరి-మార్చి) పనితీరును వెల్లడించాయి. ఈ ప్రభావం దేశీ స్టాక్‌ మార్కెట్లపై కనిపించనుంది. వీటితోపాటు ఈ వారం మరికొన్ని కంపెనీలు క్యూ4 ఫలితాలు విడుదల చేయనున్నాయి. జాబితాలో 16న విప్రో, ఎల్‌అండ్‌టీ టేకోవర్‌ చేయనున్న మైండ్‌ట్రీ, రేటింగ్ దిగ్గజం క్రిసిల్‌ 17న, ఐసీఐసీఐ లంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ 18న, టాటా కాఫీ 19న ఫలితాలు ప్రకటించనున్నాయి. శుక్రవారం మార్కెట్లు ముగిశాక విడుదలైన గణాంకాల ప్రకారం మార్చిలో రిటైల్‌ ధరల ద్రవ్యొల్బణం(సీపీఐ) 2.86 శాతంగా నమోదుకాగా.. ఫిబ్రవరిలో పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) 0.1 వృద్ధికే పరిమితమైంది.

ధరలపై దృష్టి
మార్చి నెలకు టోకు ధరల ద్రవ్యోల్బణ(డబ్ల్యూపీఐ) గణాంకాలు 15న విడుదలకానున్నాయి. ఫిబ్రవరిలో డబ్ల్యూపీఐ 2.9 శాతం పెరిగింది. కాగా.. ఈ నెల 4న జరిగిన ఆర్‌బీఐ పాలసీ సమీక్ష లోతుపాతులు మినిట్స్‌ ద్వారా 18న వెల్లడికానున్నాయి. ఇటీవలి సమీక్షలో ఆర్‌బీఐ రెపో రేటును పావు శాతం తగ్గించడం ద్వారా 6 శాతానికి చేర్చిన విషయం విదితమే. 

పోలింగ్‌ తీరు కీలకం
సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఇప్పటికే తొలి దశ పోలింగ్‌ పూర్తికాగా.. మలిదశ 18న జరగనుంది. ఎన్నికల కమిషన్ మొత్తం ఏడు దశలలో మే 19 వరకూ పోలింగ్‌ను నిర్వహించనుంది. ఫలితాలు అదే నెల 23న వెల్లడికానున్నాయి. పోలింగ్‌ తీరుతోపాటు.. ముడిచమురు ధరలు, రూపాయి కదలికలు, విదేశీ పెట్టుబడులు వంటి అంశాలకూ ప్రాధాన్యమున్నట్లు నిపుణులు చెబుతున్నారు. మరోవైపు అమెరికా, చైనా, యూరోపియన్‌ దేశాల వాణిజ్య వివాదాలు, బ్రెక్సిట్ తదితర పలు విదేశీ అంశాలు సైతం సెంటిమెంటును ప్రభావితం చేయగలవని వివరించారు.tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');