రూ.2000 కోట్ల పన్ను ఎగ్గొట్టిన ఓ మాంసం వ్యాపారి..!

రూ.2000 కోట్ల పన్ను ఎగ్గొట్టిన ఓ మాంసం వ్యాపారి..!

దేశంలో వెయ్యి రూపాయిలు పన్ను బాకీ ఉంటేనే.. వారిని ఎగవేత దారుగా ఆదాయపు పన్ను శాఖ వారు పరిగణిస్తారు. ఇతరత్రా ప్రభుత్వ లావాదేవీల్లో పన్ను ఎగవేత దారుడిగా ఇబ్బందులు కలిగిస్తారు. మరి అలాంటి ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 2000 కోట్ల పన్ను ఎగవేసింది ఓ భారతీయ కంపెనీ. నెలల తరబడి ఇన్‌కం ట్యాక్స్ వారు శోధిస్తే గానీ ఆ కంపెనీ ప్రభుత్వానికి రూ. 2000 కోట్లు ఎగవేసిందని అర్ధం కాలేదు . విదేశాలకు మాంసం ఎగుమతి దారు, 1865 లో ప్రారంభించామని చెప్పుకుంటున్న అల్లన గ్రూప్ లావాదేవీలను పరిశీలించిన ఇన్‌కం ట్యాక్స్ వారు ఏకంగా ఇన్ని కోట్ల రూపాయిలు ఎగవేశారని తేల్చారు. ఎగుమతుల విషయంలో అండర్ ఇన్వాయిస్‌లు చూపించి అల్లన గ్రూప్ ఈ పన్ను ఎగవేతకు పాల్పడిందని ఇన్‌కం ట్యాక్స్ అధికారులు అంటున్నారు. ఈ జనవరిలో ముంబై కేంద్రంగా ఉన్న, ఫిరోజ్ అల్లనకు చెందిన అల్లన గ్రూప్ కు చెందిన 50 శాఖల్లో ఐటీ సోదాలు జరిపారు. సెక్షన్ 133(A) ఇన్‌కంట్యాక్స్ చట్టం కింద వారు జరిపిన సర్వే ప్రకారం ఏకంగా అల్లన గ్రూప్ రూ. 2000 కోట్లు పన్ను రూపంలో ఎగవేసిందని వెల్లడించింది. కాగా ఈ విషయంలో అల్లన గ్రూప్‌ను ఎకనామిక్స్ టైమ్స్ ప్రతినిధులు ప్రశ్నించడానికి యత్నించగా కంపెనీ వారు స్పందించలేదని సమాచారం. కంపెనీ ఆడిట్ పుస్తకాలు, ఖాతాలు పరిశీలించిన ఐటీ అధికారులు కంపెనీ ఎగుమతి ఇన్వాయిస్‌లలో అవకతవకలు, వ్యయాలు, ఎగుమతి ఖర్చులు పెంచి చూపినట్టు వెల్లడైంది. మొత్తం మీద వేల కోట్ల పన్ను బకాయి పడినట్టు ఇన్‌కం ట్యాక్స్ నిర్ధారించింది. 

 Most Popular