Breaking News 2 - ఇన్ఫీ రిజల్ట్స్

Breaking News 2 - ఇన్ఫీ రిజల్ట్స్

దేశంలో రెండో అతి పెద్ద  దిగ్గజ ఐటీ సర్వీసుల సంస్థ ఇన్ఫోసిస్... మార్చితో నాలుగో త్రైమాసికానికి ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. 

క్యూ4లో కంపెనీ ఆదాయం రూ. 21,539 కోట్లుగా నమోదు అయింది. ఎబిట్ మార్జిన్ 21.4 శాతంగా ఉంది. డాలర్ ప్రమాణాల్లో 3,060 మిలియన్ డాలర్ల ఆదాయం నమోదయినట్లు ఇన్ఫోసిస్ వెల్లడించింది.

డిజిటల్ రెవెన్యూ 1,035 మి. డాలర్లుగా ఉండగా... కంపెనీ నికర లాభం రూ. 4,074 కోట్లకు చేరుకుంది. అలాగే ఒక్కో షేరుకు రూ. 10.50 తుది డివిడెండ్‌ను ఇన్ఫీ ప్రకటించింది.

ఈ ఫలితాలు అన్నీ మార్కెట్ అంచనాలకు దాదాపు అనుగుణంగానే ఉన్నాయి. అయితే...  2019-20 ఆర్థిక సంవత్సరానికి గైడెన్స్‌ను 7.5 - 7.9 శాతానికి తగ్గించడం మాత్రం నిరుత్సాహం కలిగించే విషయం.

క్యూ4లో పన్ను తరువాతి లాభం 13 శాతం పెరిగింది. నికర లాభం విషయంలో అంచనాలను అధిగమించడం విశేషం. డాలర్ ప్రమాణాల్లో కూడా ఆదాయం 2.44 శాతం పెరిగింది.

నిర్వహణ లాభాల మార్జిన్‌లు 22.57 శాతం నుంచి 21.4 శాతానికి తగ్గాయి. ఇది కూడా కొంత నిరుత్సాహం కలిగించే విషయమే.



Most Popular