లాభాల్లో మార్కెట్‌- అన్ని రంగాలూ

లాభాల్లో మార్కెట్‌- అన్ని రంగాలూ

మిశ్రమ ప్రపంచ సంకేతాల నడుమ సానుకూలంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరి వరకూ పటిష్టంగా కదిలాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ఆసక్తి చూపడంతో ప్రస్తావించదగ్గ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 160 పాయింట్లు పెరిగి 38,767 వద్ద నిలవగా.. నిఫ్టీ 47 పాయింట్లు ఎగసి 11,643 వద్ద ముగిసింది. హెల్త్‌కేర్, స్టీల్‌ దిగ్గజాల వెనకడుగుతో గురువారం అమెరికా మార్కెట్లు నీరసించగా.. ఆసియాలో అధిక శాతం మార్కెట్లు ఫ్లాట్‌గా నిలిచాయి. 

ఎఫ్‌ఎంసీజీ, ఆటో అప్‌
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడగా.. మీడియా, ఎఫ్‌ఎంసీజీ, ఆటో, పీఎస్‌యూ బ్యాంక్స్‌ 1.4-0.8 శాతం మధ్య పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐటీసీ, గెయిల్‌, మారుతీ, జీ, సిప్లా, అదానీ పోర్ట్స్‌, వేదాంతా, ఐషర్‌, యాక్సిస్‌, బ్రిటానియా 3.7-1.35 శాతం మధ్య ఎగశాయి. అయితే ఐబీ హౌసింగ్‌, ఐవోసీ, ఎల్‌అండ్‌టీ, టాటా మోటార్స్‌, బజాజ్ ఫైనాన్స్, ఎయిర్‌టెల్‌, టైటన్‌, హిందాల్కో, ఓఎన్‌జీసీ, ఇండస్‌ఇండ్ 2.5-0.6 శాతం మధ్య క్షీణించాయి. 

చిన్న షేర్లు ఓకే
మార్కెట్లు పటిష్ట లాభాలతో ముగిసిన నేపథ్యంలో మధ్య, చిన్నస్థాయి షేర్లు లాభపడ్డాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ 0.3 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1383 లాభపడగా 1155 నష్టాలతో ముగిశాయి.

డీఐఐలు సైలెంట్‌
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 476 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 16.6 కోట్ల విలువైన పెట్టుబడులను మాత్రమే నికరంగా వెనక్కి తీసుకున్నాయి. కాగా.. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 1430 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా.. దేశీ ఫండ్స్‌ సైతం రూ. 461 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన విషయం విదితమే.  Most Popular