మ్యాక్స్‌ వెంచర్స్- బజాజ్‌ కన్జూమర్‌ అప్‌

మ్యాక్స్‌ వెంచర్స్- బజాజ్‌ కన్జూమర్‌ అప్‌

అనుబంధ సంస్థ మ్యాక్స్‌ ఎస్టేట్స్‌ ద్వారా దక్షిణ ఢిల్లీలోని బిజినెస్‌ కేంద్రాలకు సమీపంలో కొత్త వెంచర్‌ను ప్రారంభించినట్లు  మ్యాక్స్‌ వెంచర్స్‌ వెల్లడించింది. దీంతో ఈ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. కాగా.. మరోపక్క ప్రమోటర్లు తనఖా ఉంచిన షేర్లను విడిపించినట్లు తెలియజేయడంతో బజాజ్‌ కన్జూమర్‌ కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ఇతర వివరాలు చూద్దాం..

మ్యాక్స్‌ వెంచర్స్‌
మ్యాక్స్ టవర్స్ పేరుతో ఢిల్లీ నోయిడా డైరెక్ట్‌వేకు సమీపంలో కమర్షియల్‌(ఆఫీస్‌) ప్రాజెక్టును పూర్తిచేసినట్లు మ్యాక్స్‌ వెంచర్స్‌ తాజాగా పేర్కొంది. 5.5 లక్షల చదరపు అడుగుల్లో అభివృద్ధి చేసిన మ్యాక్స్‌ టవర్స్‌ 19 ఫ్లోర్లలో ఏర్పాటైనట్లు తెలియజేసింది. ఇందుకు రూ. 600 కోట్లను ఇన్వెస్ట్‌ చేసినట్లు మ్యాక్స్‌ గ్రూప్‌ రియల్టీ సంస్థ మ్యాక్స్ వెంచర్స్‌ వెల్లడించింది. రెండేళ్లలో పూర్తిచేసిన ప్రాజెక్టును త్వరలో వాణిజ్య ప్రాతిపదికన కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు వెల్లడించిది. ఈ నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం మ్యాక్స్‌ వెంచర్స్‌ షేరు 2.6 శాతం పెరిగి రూ. 46 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 49 వరకూ ఎగసింది. కంపెనీలో ప్రమోటర్లకు 47.20% వాటా ఉంది.

Related image

బజాజ్‌ కన్జూమర్‌
కంపెనీ ఈక్విటీలో 5.5 శాతం వాటాకు సమానమైన 81.34 లక్షల షేర్లను తాజాగా ఐడీబీఐ ట్రస్టీషిప్‌ సర్వీసెస్ నుంచి విడిపించుకున్నట్లు బజాజ్ కన్జూమర్‌ పేర్కొంది. దీంతో ప్రస్తుతం ఐడీబీఐ ట్రస్టీషిప్‌ వద్ద ప్రమోటర్ల తనఖా వాటా 26.36 శాతానికి తగ్గినట్లు తెలియజేసింది. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్లు 66.86 శాతం వాటాను కలిగి ఉన్నారు. కాగా.. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో బజాజ్‌ కన్జూమర్‌ షేరు 2.2 శాతం పెరిగి రూ. 332 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 335 వరకూ ఎగసింది. Most Popular