పీసీ జ్యువెలర్స్‌ మెరుపులు- దివాన్‌ డీలా

పీసీ జ్యువెలర్స్‌ మెరుపులు- దివాన్‌ డీలా

ఒకే బ్లాక్‌డీల్‌ ద్వారా భారీ సంఖ్యలో షేర్లు చేతులు మారినట్లు వెల్లడికావడంతో పీసీ జ్యువెలర్స్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. కంపెనీకి చెందిన 17 లక్షల షేర్లు ట్రేడ్‌ అయినట్లు ఎక్స్ఛేంజీల డేటా వెల్లడించడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టారు. ఫలితంగా ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో పీసీ జ్యువెలర్స్‌ షేరు 15.5 శాతం దూసుకెళ్లింది. రూ. 111 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 115 వరకూ ఎగసింది. 

https://applyipo.com/wp-content/uploads/2016/08/Dewan-Housing-Finance-NCD-DHFL-NCD-Details-Apply-IPO.jpg

దివాన్‌ హౌసింగ్‌
కంపెనీ ఎన్‌సీడీలు, ఇతర రుణ సెక్యూరిటీల రేటింగ్‌ను బ్రిక్‌వర్క్స్‌ రేటింగ్స్‌ డౌన్‌గ్రేడ్‌ చేయడంతో దివాన్‌ హౌసింగ్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో దివాన్‌ హౌసింగ్‌ షేరు దాదాపు 3 శాతం పతనమైంది. రూ. 168 వద్ద ట్రేడవుతోంది. లిక్విడిటీ పెంచుకోవడంలో పరిమితులు, రిస్కుతో కూడిన కన్‌స్ట్రక్షన్‌ ఫైనాన్స్‌ రుణాల విక్రయం వంటి ప్రతికూల అంశాల నేపథ్యంలో రేటింగ్‌ను బ్రిక్‌వర్క్స్‌ డౌన్‌గ్రేడ్‌ చేసినట్లు దివాన్‌ హౌసింగ్‌ పేర్కొంది. కాగా.. గత రెండు నెలల్లో దివాన్‌ హౌసింగ్‌ షేరు 65 శాతం ర్యాలీ చేయడం విశేషం! Most Popular