మార్కెట్‌ అప్‌- ఎఫ్‌ఎంసీజీ, ఆటో ప్లస్‌

మార్కెట్‌ అప్‌- ఎఫ్‌ఎంసీజీ, ఆటో ప్లస్‌

మిశ్రమ ప్రపంచ సంకేతాల నడుమ సానుకూలంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు పటిష్టంగా కదులుతున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ప్రస్తావించదగ్గ లాభాలతో ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 135 పాయింట్లు పెరిగి 38,742కు చేరగా.. నిఫ్టీ 39 పాయింట్లు ఎగసి 11,636 వద్ద ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడగా.. ఎఫ్‌ఎంసీజీ, ఆటో, ఫార్మా 1.2-0.4 శాతం మధ్య పుంజుకున్నాయి.

బ్లూచిప్స్ తీరిదీ 
నిఫ్టీ దిగ్గజాలలో గెయిల్‌, ఐటీసీ, మారుతీ, సిప్లా, అదానీ పోర్ట్స్‌, యాక్సిస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, హీరో మోటో, ఐషర్‌, బ్రిటానియా 3.6-1.35 శాతం మధ్య ఎగశాయి. అయితే ఐవోసీ, ఎల్‌అండ్‌టీ, ఎయిర్‌టెల్‌, ఐబీ హౌసింగ్‌, హిందాల్కో, బీపీసీఎల్‌, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, యూపీఎల్‌ 1.5-0.64 శాతం మధ్య క్షీణించాయి. 

ఎఫ్‌అండ్‌వో ఇలా
డెరివేటివ్స్‌ విభాగంలో పీసీ జ్యువెలర్స్‌ 15 శాతం దూసుకెళ్లగా.. టీవీ 18, ఇన్ఫీబీమ్‌, జైన్‌ ఇరిగేషన్, భెల్‌, ఐఆర్‌బీ, ఐఎఫ్‌సీఐ, లుపిన్‌ 8-2.6 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క దివాన్‌ హౌసింగ్‌, జీఎస్‌ఎఫ్‌సీ, ఎక్సైడ్‌, సీజీ పవర్‌, పీవీఆర్‌, మెక్‌డోవెల్‌, హావెల్స్‌, కాల్గేట్‌ పామోలివ్‌ 3-1.25 శాతం మధ్య వెనకడుగు వేశాయి.

చిన్న షేర్లు ఓకే
మార్కెట్లు పటిష్ట లాభాలతో కదులుతున్న నేపథ్యంలో మధ్య, చిన్నస్థాయి షేర్లకూ డిమాండ్‌ కనిపిస్తోంది. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ 0.25 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1307 లాభపడగా 1078 నష్టాలతో కదులుతున్నాయి. స్మాల్‌ క్యాప్స్‌లో 63 మూన్స్‌, 20 శాతం, ప్రైకోల్‌ 17 శాతం చొప్పున దూసుకెళ్లగా, గతీ, క్వాలిటీ, గ్యూఫిక్‌ బయో, స్పైస్‌జెట్‌, టీఎన్‌ పెట్రో, ఏషియన్‌ ఆయిల్‌, టీబీజెడ్‌, రెయిన్‌, పీజీఈఎల్‌, మేఘమణి తదితరాలు 12-6 శాతం మధ్య జంప్‌చేశాయి.Most Popular