ఇండియన్స్ రుచులు మారాయ్.. ఈ 5 స్టాక్స్ కొంటే యమా టేస్టీ రిటర్న్స్..!!

ఇండియన్స్ రుచులు మారాయ్.. ఈ 5 స్టాక్స్ కొంటే యమా టేస్టీ రిటర్న్స్..!!

భారత దేశంలో వినియోగదారుల అభిరుచులు మారడం క్రమేపీ మొదలైంది.  ఈ పరిణామం ఇన్వెస్టర్లను ఆకర్షిస్తుంది.అర్బన్ మిడిల్ క్లాస్ ఆదాయాలు పెరగడం, పట్టణ మధ్యతరగతి ప్రజలు తమ కొనుగోలు శక్తిని పెంచుకోడంతో మార్కెట్లలో ఆన్ లైన్ షాపింగ్‌లు సర్వసాధారణంగా మారాయి. వీరి కొనుగోలు శక్తి పెరగడం, ఆన్‌లైన్‌లో క్షణాల్లో తమకు కావలసిన ఆహారం, కిరాణ వంటివి తెప్పించుకుంటుండంతో FMCG కంపెనీలు చెమటలు కారుస్తున్నాయి.

Image result for jubilant foodImage result for dabur

రిటైల్ స్టోర్స్ కు వెళ్ళకుండానే ఆన్‌లైన్‌లో షాపింగ్‌కు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు వినియోగ దారులు. అర్బన్ వినియోగ దారులు రానున్న 12 నెలల్లో  ఎకానమీని తీవ్ర ప్రభావితం చేయనున్నారని , వారి కొనుగోలు శక్తి పెరిగిందని HSBC గ్లోబల్ రీసెర్చ్ జరిపిన ఓ సర్వేలో వెల్లడైంది. పట్టణాల్లో గ్రోసరీ షాపింగ్, ఫుడ్ ఆర్డర్స్ వంటివి అన్నీ ఆన్‌లైన్లో విరివిగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో పిజ్జా డెలివరీ అగ్రస్థానంలో ఉండగా, ఇతర భారతీయ వంటకాలు, చైనా నూడుల్స్ రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. అంతే కాకుండా వినియోగ దారులు ఇప్పుడు తమ ఆహార విషయంలో ఆరోగ్యం, నూట్రిషన్ వంటి అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. దాంతో నాణ్యమైన ఫుడ్‌ కొనుగోలు పెరిగింది. దీంతో అవెన్యూ సూపర్ మార్కెట్స్ కు చెందిన డీ-మార్ట్, జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ కంపెనీలకు మార్కెట్లో డిమాండ్ పెరిగింది.  ఈ కంపెనీల టార్గెట్ ప్రైసెస్ రూ. 1700, 1500 గా బ్రోకరేజ్ కంపెనీలు పెంచాయి. నూట్రిషన్ కు సంబంధించిన ఉత్పత్తులు కలిగిన నెస్ట్‌లీ వంటి  కంపెనీలు లాభాల బాటలో నడవనున్నాయని HSBC పేర్కొంది. అలాగే డాబర్ వంటి కంపెనీకి HSBC బై రేటింగ్ ఇస్తూ టార్గెట్ ప్రైస్ రూ. 480గా నిర్ణయించింది. ఇలా ఆన్‌లైన్ మార్కెట్లోకి ప్రవేశించనున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఆకర్షణీయంగా మారింది.  గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థలు రిలయన్స్ స్మార్ట్, రిలయన్స్ ఫ్రెష్ , రిలయన్స్ మార్కెట్‌లు రానున్న రోజుల్లో విపరీతంగా రాణిస్తాయని అంచనా వేస్తున్నాయి. రిలయన్స్ గ్రోసరీ వ్యాపారం రానున్న మూడు సంవత్సరాల్లో వార్షిక వృద్ధి రేటు CAGR 22శాతం కంటే ఎక్కువగా ఉండబోతుందని HSBC సంస్థ అంచనా వేస్తోంది. 
 Most Popular