ఫోర్టిస్ హెల్త్‌- దీప్‌ ఇండస్ట్రీస్‌ జోరు 

ఫోర్టిస్ హెల్త్‌- దీప్‌ ఇండస్ట్రీస్‌ జోరు 

ఇటీవలే కొనుగోలు చేసిన రెలిగేర్‌ హెల్త్‌ ట్రస్ట్‌(ఆర్‌హెచ్‌టీ)ను తిరిగి విక్రయించనున్నట్లు పేర్కొనడంతో ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ కౌంటర్ జోరందుకుంది. కాగా.. మరోపక్క ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం ఓఎన్‌జీసీ నుంచి కాంట్రాక్ట్‌ లభించినట్లు వెల్లడించడంతో డ్రిల్లింగ్‌ రిగ్గుల సంస్థ దీప్‌ ఇండస్ట్రీస్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దృష్టిసారించడంతో ఈ రెండు కౌంటర్లూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం...

ఫోర్టిస్‌ హెల్త్‌కేర్
సుమారు మూడు నెలల క్రితమే సొంతం చేసుకున్న సింగపూర్‌ లిస్టెడ్‌ సంస్థ ఆర్‌హెచ్‌టీను విక్రయించే ప్రణాళికల్లో ఉన్నట్లు ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ పేర్కొంది. ఆర్‌హెచ్‌టీను ఫోర్టిస్‌ రూ. 4650 కోట్లకు కొనుగోలు చేసింది. ఇందుకు వీలుగా వివిధ పార్టీలతో చర్చలు ప్రారంభించినట్లు తెలియజేసింది. తద్వారా ఆర్‌హెచ్‌టీ విక్రయానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలియజేసింది. తద్వారా లభించిన నిధులను మలేసియా సంస్థ ఐహెచ్‌హెచ్‌ హెల్త్‌కేర్‌ కొనుగోలుకి వెచ్చించే వీలున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 142 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 145 వరకూ ఎగసింది. 

Related image

దీప్‌ ఇండస్ట్రీస్‌
ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం ఓఎన్‌జీసీ నుంచి రూ. 18 కోట్ల విలువైన ఆర్డర్ లభించినట్లు తాజాగా దీప్‌ ఇండస్ట్రీస్‌ పేర్కొంది. అహ్మదాబాద్‌ అసెట్‌కు సంబంధించి 50 ఎంటీ రిగ్‌ వర్క్‌కు కాంట్రాక్టు లభించినట్లు తెలియజేసింది. దీంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో దీప్‌ ఇండస్ట్రీస్‌ షేరు దాదాపు 3 శాతం పెరిగి రూ. 141 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 144 వరకూ ఎగసింది.Most Popular