మార్కెట్లలో మరో సంక్షోభం.. ఈ సారి ఎఫ్ఎంపిల వంతు

మార్కెట్లలో మరో సంక్షోభం.. ఈ సారి ఎఫ్ఎంపిల వంతు

మార్కెట్లను ఏదో ఒక సమస్య వేధిస్తూనే ఉంది. ఐఎల్ఎఫ్ఎస్ క్రైసిస్ - లిక్విడిటీని మర్చిపోక ముందే తాజాగా ఫిక్సెడ్ మెచ్యూరిటీ ప్లాన్స్ ఆందోళన పుట్టిస్తున్నాయి. కొటక్ మ్యూచువల్ ఫండ్ కొన్ని మెచ్యూరిటీ ప్లాన్స్‌ పూర్తైన తర్వాత కూడా మొత్తం డబ్బును చెల్లించడంలో విఫలమైంది. ఎందుకంటే జీ గ్రూప్ సుభాష్ చంద్రకు చెందిన ఎస్సెల్ గ్రూప్ డబ్బులు చెల్లించకపోవడంతో ఆ ప్రభావం వీళ్లపై పడింది. ఈ ఎఫెక్ట్‌తో మార్కెట్లో మళ్లీ ఇబ్బందులు రావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఈ తరహా క్రైసిస్ ఎప్పుడూ ఎఫ్ఎంపిలకు రాలేదు. 

వెల్త్ మేనేజర్ల లెక్కల ప్రకారం ఎస్సెల్ గ్రూప్ ఇప్పట్లో బాండ్లకు డబ్బులు చెల్లించే స్థితిలో అయితేలేదు. అందుకే మ్యూచువల్ ఫండ్స్, ఎన్‌బిఎఫ్‌సిలతో పాటు రుణదాతలందరి దగ్గరి నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకూ గడువు కోరింది. 

ఈ నేపధ్యంలో హెచ్ డి ఎఫ్ సి మ్యూచువల్ ఫండ్ సంస్థ తన ఇన్వెస్టర్లకు రోల్ ఓవర్ ఆప్షన్‌ను ఇచ్చింది. ఏప్రిల్ 15వ తేదీన మెచ్యూర్ అయ్యే ఖాతాలకు ఈ సౌలభ్యాన్ని కల్పించింది. అలా వద్దనుకునే వాళ్లకు రీఫండ్‌లో ఏదైనా కోత విధిస్తుందా అనే అంశంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. 

ఏప్రిల్ 8 నుంచి మే 31వ తేదీ మధ్య మెచ్యూర్ అయ్యే కోటక్ ఎఫ్ఎంపిల ఇన్వెస్టర్లకు మొత్తం డబ్బు చేతికి అందేట్టు కనిపించడం లేదు. ఎందుకంటే ఎస్సెల్ గ్రూపునకు చెందిన జీ ఎంటర్‌టైన్మెంట్స్, డిష్ టీవీలు రీపేమెంట్ విషయంలో ఆలస్యం చేశాయి. మన దగ్గర లాక్ - ఇన్ ఉన్న డెట్ ప్రోడక్ట్‌లో మొత్తం డబ్బును రీపేమెంట్ జరగకపోవడం ఇదే మొదటిసారి కావొచ్చు. ప్రస్తుతం ఆరు కోటక్ ఎఫ్ఎంపిలకు రూ.2094 కోట్ల అసెట్స్ ఉంటే, అందులో రూ.357 కోట్లు జీ-ఎస్సెల్ గ్రూప్ నుంచి రావాల్సి ఉంది. 

సెబీ ఆంక్షలు ఉన్నా.. కొన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థలు నాలుగు అడుగులు ముందుకేసి ప్రమోటర్లకు రుణాలు ఇవ్వడాన్ని సెబీ తీవ్రంగా పరిగణిస్తోంది. అయితే చేతులు కాలిన తర్వాత చేస్తున్న ఈ రివ్యూ చేయడం విమర్శలకు తావిస్తోంది. మొత్తం 10 ఫండ్ హౌస్‌లకు జీ - ఎస్సెల్ గ్రూపు ఎక్స్‌పోజర్ ఉంది. వీటి విలువ సుమారు రూ.8000 కోట్ల వరకూ ఉండొచ్చు. 

మార్నింగ్ స్టార్ ఇండియా లెక్కల ప్రకారం ఆదిత్యబిర్లాకు రూ.2936 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడాకు రూ.507 కోట్లు, డిహెచ్ఎఫ్ఎల్ ప్రమెరికాకు రూ.46 కోట్లు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్‌కు రూ.1009 కోట్లు, హెచ్ డి ఎఫ్ సికి రూ.1196 కోట్లు, ఐసిఐసిఐ ప్రూడెన్షియల్‌కు రూ.866 కోట్లు, కోటక్ మహీంద్రాకు రూ.447 కోట్లు, రిలయన్స్‌కు రూ.424 కోట్లు, ఎస్బీఐకి రూ.477 కోట్లు, యూటీఐకి రూ.93 కోట్ల వరకూ ఎస్సెల్ గ్రూప్ ఎక్స్‌పోజర్ ఉంది. tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');