రుపీ- 3 రోజుల ర్యాలీకి బ్రేక్‌

రుపీ- 3 రోజుల ర్యాలీకి బ్రేక్‌

దేశీ కరెన్సీ మూడు రోజుల వరుస ర్యాలీకి బ్రేక్‌ పడింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో డాలరుతో మారకంలో రూపాయి 12 పైసలు బలహీనపడి 69.04 వద్ద ప్రారంభమైంది. తదుపరి మరింత నీరసించింది. ప్రస్తుతం 20 పైసలు(0.3 శాతం) క్షీణించి 69.12 వద్ద ట్రేడవుతోంది. కాగా.. గురువారం వరుసగా మూడో రోజు రూపాయి లాభపడింది. 19 పైసలు పుంజుకుని 68.92 వద్ద ముగిసింది. ఇందుకు ప్రధానంగా దేశీ కేపిటల్‌ మార్కెట్లలో విదేశీ పెట్టుబడులు దోహదం చేస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వీటికితోడు ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు బలహీనపడటం కూడా జత కలసినట్లు తెలియజేశారు. గురువారం రూపాయి 69.15 వద్ద ప్రారంభమై ఒక దశలో 68.83 వరకూ బలపడింది. 69.21 వరకూ నీరసించింది కూడా. 

రెండో రోజూ జోరు
డాలరుతో మారకంలో వరుసగా రెండో రోజు బుధవారం దేశీ కరెన్సీ జోరందుకుంది. 69.26 వద్ద కనిష్టాన్ని, 69.09 వద్ద గరిష్టాన్నీ తాకిన రూపాయి చివరికి 19 పైసలు ఎగసి 69.11 వద్ద స్థిరపడింది. ఇదే విధంగా మంగళవారం సైతం రూపాయి 37 పైసలు జంప్‌చేసి 69.30 వద్ద ముగిసింది. తద్వారా మూడు రోజుల వరుస నష్టాలకు రూపాయి చెక్‌ పెట్టింది. గత వారం చివరి రెండు రోజులూ క్షీణపథంలోసాగిన రూపాయి సోమవారం సైతం బలహీనపడిన విషయం విదితమే. Most Popular