సెన్సెక్స్ సెంచరీ- అన్ని రంగాలూ!

సెన్సెక్స్ సెంచరీ- అన్ని రంగాలూ!

ప్రపంచ సంకేతాలు అటూఇటుగా ఉన్నప్పటికీ దేశీ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 106 పాయింట్లు బలపడి 38,713కు చేరగా.. నిఫ్టీ 28 పాయింట్ల లాభంతో 11,625 వద్ద ట్రేడవుతోంది. హెల్త్‌కేర్, స్టీల్‌ దిగ్గజాలు డీలాపడటంతో గురువారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. యూరోపియన్‌ మార్కెట్లు లాభపడగా.. ప్రస్తుతం ఆసియాలో మిశ్రమ ధోరణి నెలకొంది. అయితే అధిక శాతం మార్కెట్లు ఫ్లాట్‌గా కదులుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా తొలి దశ పోలింగ్‌ ప్రారంభమైన నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు.

ఐటీ, ఫార్మా ప్లస్‌లో 
ఎన్‌ఎస్‌ఈలో ఐటీ, ఫార్మా, మెటల్‌, రియల్టీ 0.8-0.4 శాతం మధ్య పుంజుకోగా, ఆటో నామమాత్ర వెనకడుగులో ఉంది. నిఫ్టీ దిగ్గజాలలో బీపీసీఎల్‌, గెయిల్‌, ఎయిర్‌టెల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, టాటా స్టీల్‌, ఇన్ఫోసిస్‌, జీ, ఇన్ఫ్రాటెల్‌, అదానీ పోర్ట్స్‌, యస్‌ బ్యాంక్‌ 1.5-0.7 శాతం మధ్య పెరిగాయి. అయితే గ్రాసిమ్‌, బజాజ్‌ ఆటో, టాటా మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎన్‌టీపీసీ, ఎల్‌అండ్‌టీ 1-0.4 శాతం మధ్య క్షీణించాయి. 

ఎఫ్‌అండ్‌వో ఇలా
డెరివేటివ్స్‌ విభాగంలో అదానీ పవర్, కజారియా, ఐజీఎల్‌, లుపిన్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, జైన్‌ ఇరిగేషన్‌, ఇన్ఫీబీమ్‌, డీఎల్‌ఎఫ్‌, సుజ్లాన్, చెన్నై పెట్రో 3.4-1.5 శాతం మధ్య ఎగశాయి. కాగా.. మరోవైపు హావెల్స్‌, దివాన్‌ హౌసింగ్‌, చోళమండలం, జీఎస్‌ఎఫ్‌సీ, పేజ్‌, ఇండియా సిమెంట్స్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌, ఎక్సైడ్‌ 1.2-0.6 శాతం మధ్య వెనకడుగు వేశాయి.

చిన్న షేర్లు ఓకే
మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమైన నేపథ్యంలో చిన్నస్థాయి షేర్లకూ డిమాండ్‌ కనిపిస్తోంది. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ 0.25 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 855 లాభపడగా 452 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. స్మాల్‌ క్యాప్స్‌లో ప్రైకోల్‌ 15 శాతం దూసుకెళ్లగా, స్పైస్‌జెట్‌, హెర్క్యులెస్, ప్రభాత్‌, 63 మూన్స్‌, పంజాబ్‌ కెమ్‌, జీపీటీ, బీఆర్‌ఎన్‌ఎల్‌, వాటర్‌బేస్‌, లుమాక్స్‌ టెక్‌, రాంకీ, ఆస్ట్రాజెనెకా తదితరాలు 7-3.5 శాతం మధ్య జంప్‌చేశాయి.Most Popular