యూఎస్‌ మార్కెట్లకు హెల్త్‌కేర్‌ ఫీవర్‌

యూఎస్‌ మార్కెట్లకు హెల్త్‌కేర్‌ ఫీవర్‌

మార్కెట్లను ప్రభావితం చేయగల ప్రధాన అంశాలు కొరవడటంతో గురువారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు కన్సాలిడేషన్‌ బాటలో సాగాయి. హెచ్చుతగ్గుల మధ్య చివరికి వరుసగా రెండో రోజు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ముగిశాయి. ఫలితాల సీజన్‌ వేడెక్కనుండగా.. ప్రపంచ జీడీపీ మందగమన అంచనాలు, ఫెడ్‌ సరళతర విధానాలు వంటి అంశాల నేపథ్యంలో ట్రేడర్లు వేచిచూసే ధోరణి అవలంబిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. గురువారం డోజోన్స్‌ 74 పాయింట్ల(0.3 శాతం) నష్టంతో 26,083కు చేరగా.. ఎస్‌అండ్‌పీ 4 పాయింట్లు(0.15 శాతం) నీరసించి 2,884 వద్ద నిలిచింది. నాస్‌డాక్‌ సైతం 23 పాయింట్లు(0.3 శాతం) వెనకడుగువేసి 7,941 వద్ద స్థిరపడింది. గత వారం నిరుద్యోగ గణాంకాలు 1969 తదుపరి కనిష్టానికి చేరగా.. ఉత్పాదక ధరలు అక్టోబర్‌ తరువాత భారీగా ఎగసినట్లు శ్రామికశాఖ వెల్లడించింది.

Image result for AK steel corp

Image result for US steel corp

ఫలితాల సీజన్‌
బ్యాంకింగ్‌ దిగ్గజాలు జేపీ మోర్గాన్‌, వెల్స్‌ ఫార్గో నేడు క్యూ1 ఫలితాలు ప్రకటించనుండగా.. సోమవారం సిటీగ్రూప్‌, గోల్డ్‌మన్‌ శాక్స్, మంగళవారం మోర్గాన్‌ స్టాన్లీ, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా పనితీరు వెల్లడికానుంది. కాగా.. యూఎస్‌ సెనేటర్‌ బెర్నీ శాండర్స్‌ అందరికీ మెడికేర్‌ ప్రతిపాదన తీసుకురావడంతో హెల్త్‌కేర్ స్టాక్స్‌ డీలాపడ్డాయి. యునైటెడ్‌ హెల్త్‌ గ్రూప్‌ 5 శాతం పతనమైంది. బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేయడంతో యూఎస్‌ స్టీల్‌ కార్ప్ 3 శాతం క్షీణించింది. ఈ బాటలో ప్రత్యర్ధి సంస్థలు ఏకే స్టీల్‌ హోల్డింగ్‌ కార్ప్ 8 శాతం, స్టీల్‌ డైనమిక్స్‌ 3 శాతం చొప్పున పతనమయ్యాయి. కంపెనీ టర్న్‌అరౌండ్‌ ప్రణాళికపై సందేహాలు తలెత్తడంతో హోమ్‌ ఫర్నీషింగ్‌ రిటైలర్ బెడ్‌ బాత్‌ బియాండ్‌ షేరు 9 శాతం కుప్పకూలింది. ఇక ఉబర్‌ టెక్నాలజీస్‌ ఐపీవోకు రానుండటంతో లిఫ్ట్‌ ఇంక్‌ 3 శాతం ఎగసింది.

ఆసియా డీలా
యూరోపియన్‌ స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. ఫ్రాన్స్‌ 0.7 శాతం, జర్మనీ 0.25 శాతం చొప్పున పుంజుకోగా.. యూకే యథాతథంగా నిలిచింది. ప్రస్తుతం ఆసియాలో ప్రతికూల ట్రెండ్‌ కనిపిస్తోంది. జపాన్‌ 0.6 శాతం లాభపడగా.. కొరియా 0.15 శాతం బలపడింది. హాంకాంగ్‌, సింగపూర్‌, చైనా 0.2 శాతం స్థాయిలో వెనకడుగు వేశాయి. మిగిలిన మార్కెట్లలో ఇండొనేసియా, థాయ్‌లాండ్‌, తైవాన్‌ యథాతథంగా కదులుతున్నాయి.Most Popular