మోడీ రెండోసారి గెలిస్తే మార్కెట్లకు తిరుగుండదా ? ఇదీ అసలు లెక్క!

మోడీ రెండోసారి గెలిస్తే మార్కెట్లకు తిరుగుండదా ? ఇదీ అసలు లెక్క!

సార్వత్రిక ఎన్నికల సమరం మొదలైంది. పోలింగ్ కూడా ప్రారంభమైపోయింది. ఫలితాల లెక్క తేలడానికి ఇంకా నెలకు పైగా సమయం ఉంది కానీ... ఇప్పుడు మార్కెట్లు ఎలాంటి ఫలితాలను ఆశిస్తున్నాయి? ఒకవేళ మోడీ మళ్లీ గెలిస్తే మార్కెట్ రూట్ ఎలా ఉండొచ్చు అనే అంచనాలు ఎక్కువయ్యాయి.

విదేశీ ధనం పెట్టుబడులుగా తరలివచ్చే ఆసియా దేశాలలో భారత్ ముందు స్థానంలో ఉంటుంది. ముఖ్యంగా 2019లో అయితే ఎఫ్ఐఐ నిధుల ప్రవాహం మరీ ఎక్కువగా ఉండి, రికార్డులు సృష్టిస్తోంది. ఇదంతా నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందనే నమ్మకంతోనే అని... మార్కెట్ వర్గాల విశ్వాసం.

ఆసియా కంపెనీలతో పోల్చితే
మొత్తం 21 అంతర్జాతీయ ఫండ్ హౌస్‌లు, వ్యూహకర్తలు అందించిన సర్వే ప్రకారం.. మోడీ తిరిగి గెలవడం కష్టమేమీ కాబోదు. అయితే ఇదే జరిగితే పరిస్థితి ఏంటనేదే ప్రశ్న. ఇప్పటికే మార్కెట్ వాల్యుయేషన్స్ అధికంగా ఉండడంతో.. మెజారిటీని మోడీ సాధించకపోయినా... లేక మరో కూటమి కట్టాల్సి వచ్చినా... ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయినా... ప్రస్తుతం భారత మార్కెట్లలో ర్యాలీకి వెంటనే బ్రేక్ పడే అవకాశాు పుష్కలంగా ఉన్నాయి. 

ఇక్కడ అధికారం కాదు ముఖ్యం... మెజారిటీ సాధించడం అంటున్నారు నిపుణులు. మోడీ విజయం సాధించడం మార్కెట్లకు మంచి విషయమే అయినా... ఇప్పటికే ఆ స్థాయికి ఇండెక్స్‌లు చేరుకున్నాయన్నది వారి వాదన. 2014లో మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మార్కెట్లలో జోరు బాగానే కనిపించింది. MSCI ఏసియా పసిఫిక్‌తో పోల్చితే 4 రెట్లు ర్యాలీ చేసింది. ఆసియా-పసిఫిక్‌లో ఇతర పీర్ కంపెనీలతో పోల్చితే... షేర్‌ల విలువ 38 శాతం అధికంగా ఉంది. 

ఆర్బీఐ తోడు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా గత కొంతకాలంగా స్టాక్ మార్కెట్‌కు అనుకూలంగా వ్యవహరిస్తోంది. ఈ ఏడాది రెండోసారి వడ్డీ రేట్లను తగ్గించడంతో, గోల్డ్‌మ్యాన్ శాక్స్ వంటి బ్రోకరేజ్ గ్రూప్‌ల నుంచి బుల్లిష్ వ్యూ అందుతోంది. స్థానిక రీసెర్చ్ హౌస్‌లు కూడా మన మార్కెట్లపై బుల్లిష్ ధోరణినే కొనసాగిస్తున్నాయి. డీఐఐలు కూడా పెట్టుబడులు చేస్తున్నారు.

పాకిస్తాన్‌తో ఫైట్... మౌలికానికి మద్దతు
పాకిస్తాన్‌తో సరిహద్దు తగాదా విషయంలో నరేంద్ర మోడీ కఠినంగా వ్యవహరించడం, ఆయన ఖ్యాతిని మరింతగా పెంచింది. ఆ తర్వాత ఒపీనియన్ పోల్స్‌లో భారతీయ జనతా పార్టీకి అవకాశాలు మెరుగయ్యాయి కూడా. ఇతర పార్టీలు ప్రజాకర్షక సంక్షేమ పథకాలను ప్రకటిస్తుంటే... బీజేపీ మాత్రం తమ ఎజెండాలో 1.44 ట్రిలియన్ డాలర్లను ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పై ఖర్చు చేస్తామని చెప్పింది.

ఆర్థిక సంస్కరణలకు ప్రాధాన్యత ఇస్తుండడం... ప్రజల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు లభించే అవకాశం ఉండకపోవచ్చని కొన్ని వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అయితే ఇన్వెస్టర్లు మాత్రం... మోడీ అయినా లేక మరెవరు అధికారంలో వచ్చినా... ఉద్యోగాలను సృష్టించే విధంగా విధానాలను రూపొందించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయాలని కోరుకుంటున్నారు. ఇది వినియోగం పెరగడానికి తోడ్పడడంతో పాటు... బ్యాంకింగ్ సెక్టార్‌కు కూడా సహాయపడుతుంది.

మోడీ హయాంలో ఎలా ఉందంటే
నరేంద్రుడి హయాంలో జీఎస్‌టీ వంటి ఏకరూపతా పన్నును ప్రవేశపెట్టడం జరిగినా... దివాలా చట్టం సవరణలు, డీమానిటైజేషన్ వంటివి కూడా ఉన్నాయి. ప్రధానంగా నగదు చెలామణీపై ఆధారపడిన మన దేశంలో... ఇది తాత్కాలికంగా ఆర్థిక వృద్ధి రేటు మందగమనానికి కారణం అయింది.
ఆసియా మార్కెట్లతో పోల్చితే భారతీయ ఈక్విటీలు ప్రీమియంతో ట్రేడవుతున్నాయి. అందుకే ప్రస్తుత ప్రతిపక్షాలు.. రేపు అధికారంలో వస్తే, మార్కెట్లకు నిరుత్సాహం తప్పకపోవచ్చని స్టాక్ మార్కెట్ వర్గాలు అంటున్నాయి.
 tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');