గ్రీవ్స్‌ కాటన్‌ ఖుషీ- లక్ష్మీ విలాస్‌ విలాపం

గ్రీవ్స్‌ కాటన్‌ ఖుషీ- లక్ష్మీ విలాస్‌ విలాపం

ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో లిథియం అయాన్‌ మోడళ్లను ప్రవేశపెట్టే ప్రణాళికల్లో ఉన్నట్లు వెల్లడికావడంతో డీజిల్‌ ఇంజిన్ల సంస్థ గ్రీవ్స్‌ కాటన్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో నష్టాల మార్కెట్లోనూ ఈ కౌంటర్‌ లాభాలతో సందడి చేస్తోంది. అయితే మరోపక్క డైరెక్టర్ల బోర్డు సమావేశంకానున్న నేపథ్యంలో ప్రయివేట్ రంగ సంస్థ లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో ఈ కౌంటర్ డౌన్‌ సర్క్యూట్‌ను తాకింది. ఇతర వివరాలు చూద్దాం.. 

గ్రీవ్స్‌ కాటన్‌
ఎలక్ట్రిక్‌ వాహనాల విభాగంలోకి ప్రవేశించనున్నట్లు వెల్లడించడంతో గ్రీవ్స్‌ కాటన్‌ తాజాగా పేర్కొంది. కోయంబత్తూర్‌ స్టార్టప్‌ సంస్థ యాంపియర్‌ వెహికల్స్‌ తయారీ బ్యాటరీ ఆధారిత స్కూటర్లు త్వరలో మార్కెట్లో విడుదలకానున్నట్లు తెలియజేసింది. ఇందుకు యాంపియర్‌కు టెక్నాలజీ అందిస్తున్నట్లు తెలియజేసింది. కాగా.. 2018 ఆగస్ట్‌లో యాంపియర్‌లో 67 శాతం వాటను రూ. 77 కోట్లకు గ్రీవ్స్‌ కాటన్‌ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో గ్రీవ్స్‌ కాటన్‌ కౌంటర్‌ జోరందుకుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 152 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 154ను సైతం అధిగమించింది. 

Related image

లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌
ఈక్విటీ షేర్ల ప్రిఫరెన్షియల్‌ కేటాయింపులు, టైర్‌-1 బాండ్ల జారీ ద్వారా నిధుల సమీకరణ ప్రతిపాదనపై చర్చించేందుకు బోర్డు ఈ నెల 12న(శుక్రవారం) సమావేశంకానున్నట్లు లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ తాజాగా వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ షేరు 5 శాతం పతనమై రూ. 88 దిగువన ఫ్రీజయ్యింది. మంగళవారం సైతం ఈ షేరు 5 శాతం డౌన్‌ సర్క్యూట్‌ వద్ద నిలవడం గమనార్హం. ఇటీవల లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ను విలీనం చేసుకునేందుకు ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ప్రణాళికలు ప్రకటించిన విషయం విదితమే. Most Popular