ఈ ర్యాలీలో నిఫ్టీని బీట్ చేసిన టాప్ 5 ఫండ్స్

ఈ ర్యాలీలో నిఫ్టీని బీట్ చేసిన టాప్ 5 ఫండ్స్

ఈక్విటీ మార్కెట్లలో ర్యాలీ కొనసాగుతోంది. ఎఫ్ఐఐల నుంచి నిధులు, ఎన్డీఏ మళ్లీ అధికారంలోకి వస్తుందనే అంచనాలు మార్కెట్లను పైపైకి తీసుకెళ్తున్నాయి. డిసెంబర్ 10వ తేదీ నుంచి నిఫ్టీ 10488 మార్క్ నుంచి 11672 స్థాయికి పరుగు పెట్టింది. అతి తక్కువకాలంలో సుమారు 12 శాతం లాభాలను ఇచ్చింది. ప్రధానంగా బ్యాకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్‌ థీమ్‌గా ఉన్న ఫండ్స్ నిఫ్టీని ఔట్ బీట్ చేశాయి. తక్కువ కాలంలో నిఫ్టీ కంటే మెరుగైన లాభాలను అందించిన ఫండ్స్ వివరాలు ఇప్పుడు చూద్దాం.

హెచ్ ఎస్ బి సి మల్టీక్యాప్ ఫండ్
HSBC MultiCap Fund
టాప్ 3 హోల్డింగ్స్ - హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్, ఐసిఐసిఐసి బ్యాంక్, ఇన్ఫోసిస్
రిటర్న్స్ - 13.14 శాతం
ఫండ్ మేనేజర్ - నీలోత్పల్ సహాయ్
బ్యాంకింగ్ వెయిటేజ్ - 40 శాతం

ఐఐఎఫ్ఎల్ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్
అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ - రూ.164 కోట్లు
ఫండ్ మేనేజర్ - ప్రశాస్తా సేథ్
టాప్ 3 హోల్డింగ్స్ - హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్, మెర్క్, ఐసిఐసిఐ బ్యాంక్
రిటర్న్స్ - 16.33 శాతం
టెక్ మహీంద్రా, ఎస్బీఐ వంటి స్టాక్స్ మంచి రిటర్న్స్ వచ్చేందుకు దోహదపడ్డాయి. ఫండ్ మేనేజర్ ప్రధానంగా 28-30 స్టాక్స్‌పై మాత్రమే దృష్టిసారిస్తారు. క్యాపిటల్ లైట్ బిజినెస్ మోటడల్, ఎట్రాక్టివ్ వేల్యుయేషన్‌పై వీళ్ల కాన్‌సన్‌ట్రేషన్ ఎక్కువ. 

ఫ్రాంక్లిన్ ఇండియా ఫోకస్డ్ ఈక్విటీ
అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ - రూ.7445 కోట్లు
ఫండ్ మేనేజర్ - ఆనంద్ రాధాక్రిష్ణన్, రోషి జైన్
టాప్ 3 హోల్డింగ్స్ - హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్, ఎస్బీఐ, ఐసిఐసిఐ బ్యాంక్
రిటర్న్స్ - 13.84 శాతం
పోర్ట్‌ఫోలియోలో గరిష్టంగా 30 స్టాక్స్ మాత్రమే ఉంటాయి. బ్యాంకింగ్ స్పేస్‌లో ఉన్న స్టాక్స్ పై 61 శాతం గురి. అది కూడా ప్రధానంగా 4 స్టాక్స్‌పైనే ఫోకస్ ఉంటుంది. ప్రధానంగా యాక్సిస్, ఎస్బీఐ, ఉజ్జీవన్ వంటి స్టాక్స్ ఫండ్ పర్ఫార్మెన్స్‌కు దోహదపడ్డాయి. 

ఎస్బీఐ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్
అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ - రూ.3580 కోట్లు
ఫండ్ మేనేజర్ - ఆర్. శ్రీనివాసన్
టాప్ 3 హోల్డింగ్స్ - హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్, ఎస్బీఐ, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ హైజీన్ 
రిటర్న్స్ - 13.11 శాతం
గరిష్టంగా పోర్ట్‌ఫోలియోలో 25-30 స్టాక్స్ మాత్రమే ఉంటాయి. టాప్ 10 స్టాక్స్‌ మొత్తం పోర్ట్‌ఫోలియోలో 50-55 శాతాన్ని ఆక్రమిస్తాయి. మంచి పొటెన్షియల్ ఉన్న స్టాక్స్‌ను రిస్క్ చేసైనా బెట్ చేస్తారు ఫండ్ మేనేజర్. 

హెచ్ డి ఎఫ్ సి ఈక్విటీ ఫండ్
అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ - రూ. 22,503 కోట్లు
ఫండ్ మేనేజర్ - ప్రశాంత్ జైన్
టాప్ 3 హోల్డింగ్స్ - ఎస్బీఐ, ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్
రిటర్న్స్ - 12.95 శాతం

హైక్వాలిటీ కంపెనీలను ఫండ్ మేనేజర్ పిక్ చేస్తారు. ఎస్బీఐ, ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, రిలయన్స్, హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్, ఎల్ అండ్ టి టాప్ పొజిషన్స్. ఫార్మాకు తక్కువ వెయిటేజ్, కార్పొరేట్ బ్యాంక్స్‌కు ఎక్కువ వెయిటేజ్ ఇవ్వడం వల్లే ఈ స్థాయిలో పర్ఫార్మెన్స్. 

* ఈ ఫండ్స్ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇవి ఇన్వెస్ట్మెంట్ రికమెండేషన్స్ మాత్రం కావు. tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');