పాలీక్యాబ్‌ ఇండియా ఐపీఓకు స్పందన అదుర్స్‌

పాలీక్యాబ్‌ ఇండియా ఐపీఓకు స్పందన అదుర్స్‌

పాలీక్యాబ్‌ ఐపీఓకు అద్భుత స్పందన లభించింది. మంగళవారంతో ముగిసిన ఈ ఇష్యూకు 52 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రిప్షన్‌ వచ్చింది. మొత్తం 91,63,83,591 షేర్లకు గాను 1,76,37,777 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. ఈ ఏడాది వచ్చిన ఐపీఓల్లో 10 శాతం పైగా ఓవర్‌ సబ్‌స్క్రిప్షన్‌ లభించడం ఇదే తొలిసారి. గత ఏడాది జూలైలో వచ్చిన HDFC AMC ఐపీఓకు 82.99 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ రాగా... ఆ తర్వాత భారీ రెస్పాన్స్‌ పాలీక్యాబ్‌కే వచ్చింది. 

క్యూఐబీ కోటాలో 92.44 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ రాగా, ఎన్‌ఐఐ కోటాలో 110.42 రెట్లు, రిటైల్‌ సెగ్మెంట్లో 4.61 రెట్లు బిడ్లు దాఖలయ్యాయి. ఈ ఏడాది ప్రైమరీ మార్కెట్లో మొత్తం 6 ఇష్యూలు రాగా మెట్రోపొలిస్‌కు 5.83 రెట్ల  సబ్‌స్క్రిప్షన్‌ లభించింది. 

రూ.1346 కోట్ల నిధుల సమీకరణ కోసం వస్తోన్న ఈ కంపెనీ ఐపీఓ ధరల శ్రేణిని ఒక్కో షేరుకు రూ.533-538గా నిర్ణయించింది. 1.75 లక్షల షేర్లను ఉద్యోగుల వాటా కింద విక్రయించారు. అలాగే ఉద్యోగులకు ఒక్కో షేరుకు కంపెనీ రూ.53 డిస్కౌంట్‌ను అందించింది. ఈ ఇష్యూకు లీడ్‌ మేనేజర్లుగా యాక్సిస్‌ క్యాపిటల్‌, సిటీగ్రూప్‌ గ్లోబల్‌, ఎడెల్‌వైజ్‌ ఫైనాన్షియల్, ఐఐఎఫ్‌ఎల్‌ హోల్డింగ్స్‌, కోటక్‌ మహీంద్రా క్యాపిటల్‌, యెస్‌ సెక్యూరిటీస్‌లు వ్యవహరించాయి.