పడినప్పుడల్లా ఆ స్టాక్స్‌ను భలేగా కొన్నారు

పడినప్పుడల్లా ఆ స్టాక్స్‌ను భలేగా కొన్నారు

హెచ్ డి ఎఫ్ సి అసెట్ మేనేజ్మెంట్.. దేశంలోని ఓ అతిపెద్ద ప్రముఖ మ్యూచువల్ ఫండ్ సంస్థ. దీని గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఈ సంస్థ ఫండ్ మేనేజర్లు సుమారు రూ.3.50 లక్షల కోట్ల ఫండ్‌ను మేనేజ్ చేస్తారు. అంత పెద్ద ఫండ్ కాబట్టే.. వాళ్ల నిర్ణయాలు కూడా ఆచితూచి ఉంటాయి. తాజాగా ఈ ఏఎంసీ బ్యాంకింగ్, పవర్, హోటల్స్, ఇన్ఫ్రా, మైనింగ్ రంగాల్లోని స్టాక్స్‌ను మార్చి నెలలో ఇబ్బడిముబ్బడిగా కొనింది. మార్కెట్ల పతన సమయంలో ఇన్వెస్టర్లంతా భయంతో దూరం జరిగిన వేళ ఈ ఫండ్ మేనేజర్లు భారీగా స్టాక్స్ కొన్నారు. 

ఎన్టీపీసీ, బ్యాంక్ ఆఫ్ బరోడా స్టాక్స్‌ను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు టచ్ చేయరు. ఎందుకంటే పవర్ సెక్టార్‌ అంతంతమాత్రంగానే ఉంది. ఎన్పీఏ సమస్యలతో బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా కష్టాల్లో ఉంది. తాజాగా విజయా బ్యాంక్, దేనా బ్యాంక్ విలీన నేపధ్యంలో సినర్జీ అడ్జస్ట్‌మెంట్‌కు టైం పడ్తుంది. కానీ ఈ ఫండ్ మేనేజర్లు మాత్రం     మార్చి నెలలో 5.71 కోట్ల ఎన్టీపీసీ(NTPC), 1.99 కోట్ల BoB బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్లను తమ కిట్టీలోకి చేర్చుకున్నారు. ఆ తర్వాత కోల్ ఇండియా(88.48 లక్షలు), ఓరియంటల్ బ్యాంక్(78.55 లక్షలు), డిఎల్ఎఫ్(52.05 లక్షలు), ఇండియన్ హోటల్స్(43.63 లక్షలు) , పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(42.27 లక్షలు), ఛాలెట్ హోటల్(10.30 లక్షలు) స్టాక్స్‌ను కొనుగోలు చేశారు హెచ్ డి ఎఫ్ సి ఫండ్ మేనేజర్లు. 

పీఎస్‌యూ బ్యాంకుల్లో
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ స్టాక్స్‌లో ఎస్బీఐ (23 లక్షలు), యూనియన్ బ్యాంక్ (18 లక్షలు), అలహాబాద్ బ్యాంక్ (15 లక్షలు) షేర్లు కొన్నారు. ఇక ప్రైవేట్ బ్యాంక్ స్పేస్‌లో  కరూర్ వైశ్యా బ్యాంక్, కొటక్ మహీంద్రా, హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లను కూడా ఫండ్ మేనేజర్లు పిక్ చేసుకున్నారు. 

ఆటో యాన్సిలరీ ప్యాక్‌లో
గ్యాబ్రియల్ ఇండియా, మారుతి సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రా స్టాక్స్‌ను సెలెక్ట్ చేసుకున్నారు. వీటికి తోడు స్పైస్ జెట్‌లో కూడా సుమారు 93 వేల షేర్లను పిక్ చేసుకున్నారు హెచ్ డి ఎఫ్ సి ఏఎంసి ఫండ్ మేనేజర్లు. 

కొన్ని స్టాక్స్ అమ్మేశారు కూడా..
ఈ ఫండ్ హౌస్ కొన్ని స్టాక్స్‌ను కొనుగోలు చేయడంతోపాటు అండర్ పర్ఫార్మర్లను వదిలించుకుంది కూడా. అందులో భాగంగా ఐడిఎఫ్‌సి, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, జెఎస్‌డబ్ల్యు ఎనర్జీ, పెట్రోనెట్ ఎల్ఎన్‌జి, ఆర్ఈసీ, అశోక్ లేల్యాండ్ ఉన్నాయి. 

కొన్ని కొత్త పేర్లు
తాజాగా భెల్, నాల్కో, వొడాఫోన్ ఐడియా షేర్లను ఈ ఫండ్ హౌస్ కొత్తగా పిక్ చేసుకున్నట్టు ఏస్ మ్యూచువల్ ఫండ్ డేటా చెబ్తోంది. 

కొన్ని వదిలించుకున్నారు
మార్చి నెలలో ఆదిత్య బిర్లా నువో, ఆస్ట్రా మైక్రోవేవ్, భారత్ ఫోర్జ్, సీఈఎస్ఈ వెంచర్స్, మ్యాట్రిమోనీ డాట్ కామ్, రిలయన్స్ క్యాపిటల్, స్పెన్సర్స్ రిటైల్, వి గార్డ్ స్టాక్స్ నుంచి పూర్తిగా వైదొలిగారు. tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');