సైలెంట్‌గా ఈ స్టాక్‌లో వాటా పెంచుకున్న రాకేష్ జున్‌జున్‌వాలా

సైలెంట్‌గా ఈ స్టాక్‌లో వాటా పెంచుకున్న రాకేష్ జున్‌జున్‌వాలా

బిగ్ బుల్, ఏస్ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా స్టాక్ పికింగ్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఆయన ఏదైనా స్టాక్‌ లేదా కంపెనీని నమ్మాడంటే దాన్ని ఇక అంత ఈజీగా వదలిపెట్టడు. అది ఫెయిల్ అయినా.. సక్సెస్ అయినా ఆయన స్టైల్ అలానే ఉంటుంది. తాజాగా ఆయన దృష్టి ఫస్ట్‌సోర్స్ సొల్యూషన్స్ స్టాక్‌పై పడింది. గతంలో కూడా ఆయన ఈ సంస్థలో వాటా ఉన్నప్పటికీ ఈ మధ్య డౌన్‌ఫాల్‌లో సదరు స్టాక్స్‌ను మరింతగా అక్యుములేట్ చేసుకున్నారు. 

తాజా లెక్కల ప్రకారం మార్చి క్వార్టర్‌ ముందు వరకూ ఆయనకు ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ సంస్థలో 2.89 శాతం వాటా ఉండేది. ఈ మధ్యకాలంలో సదరు స్టాక్ బాగా క్షీణించింది. గత ఆరు నెలలకాలంలో ఎఫ్ఎస్ఎల్ స్టాక్ రూ.60 స్థాయి నుంచి రూ.40కి దిగొచ్చింది(ఫిబ్రవరి 2019లో). దీన్నే అదనుగా చూసిన రాకేష్‌ ఈ స్టాక్‌లో గణనీయంగా వాటాలు పెంచుకున్నారు. తక్కువ ధరలో స్టాక్స్‌ను అక్యుములేట్ చేసుకున్నారు. 

స్టాక్‌లో జోష్
ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ స్టాక్ రూ.40 స్థాయి నుంచి రూ.50కి పెరిగింది. అతి తక్కువ కాలంలోనే 25 శాతానికి పైగా లాభాలను ఈ స్టాక్ అందించింది. ఆర్.జె. వాటా పెంపు వార్తలతో ఈ రోజు కూడా స్టాక్ అనూహ్యమైన వాల్యూమ్స్‌తో 6 శాతానికిపైగా లాభాలతో దూసుకుపోయింది. స్టాక్ రూ.50 మార్కుపైనే పటిష్టంగా ట్రేడవుతోంది. 

ఏంటీ కంపెనీ కథ
ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ సంస్థ బిజినెస్ ప్రాసెస్, ఔట్‌సోర్సింగ్ సేవల్లో నిమగ్నమై ఉంది. మంచి వేల్యుయేషన్స్, పటిష్టమైన క్యాష్ జనరేషన్, డివిడెండ్ ఈల్డ్ నేపధ్యంలో చాలా మంది ఎనలిస్టులు ఈ స్టాక్‌ను రెగ్యులర్‌గా ట్రాక్ చేస్తూ ఉంటారు. 
అయితే 2019 గైడెన్స్‌ను 7-9 శాతం నుంచి 3-4 శాతానికి యాజమాన్యం తగ్గించడం వల్ల సదరు స్టాక్‌లో సెల్లింగ్ ప్రెషర్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా నమోదైంది. అయితే మార్చి క్వార్టర్‌లో 3-4 శాతం వరకూ క్వార్టర్ ఆన్ క్వార్టర్ గ్రోత్ నమోదు కావొచ్చని యాజమాన్యం ధీమాగా ఉంది. బీఎఫ్ఎస్ఐ, హెల్త్ కేర్, మార్టిగేజ్ బిజినెస్‌లలో కొద్దోగొప్పో వృద్ధి ఇందుకు కారణమని మేనేజ్మెంట్ చెబ్తోంది. 


 tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');