నేటి నుంచి పీవీపీ షేర్ల ట్రేడింగ్‌ బంద్‌

నేటి నుంచి పీవీపీ షేర్ల ట్రేడింగ్‌ బంద్‌

తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్‌కు చెందిన పీవీపీ వెంచర్స్‌ ఇన్వెస్టర్లను నిట్టనిలువునా ముంచేసింది. ఎక్స్ఛేంజ్‌ల నిబంధనలకు అనుగుణంగా బకాయిలు చెల్లించకపోవడంతో ఇవాళ్టి నుంచి పీవీపీ వెంచర్స్‌ లిమిటెడ్‌ షేర్ల ట్రేడింగ్‌ను సెబీ నిలిపివేసింది.  ఈ రోజు నుంచి పీవీపీ షేర్లలో ఎలాంటి లావాదేవీలు జరగవు. దీంతో  వేలాది మంది పీవీపీ షేర్‌హోల్డర్ల షేర్లలో కోట్లాది షేర్లు ఉండటంతో వారి  పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌లో పట్టుబడటంతో పీవీపీకి 20 కోట్ల రూపాయల పెనాల్టీని సెబీ విధించింది. అయితే ఎన్ని అవకాశాలిచ్చినా పీవీపీ సంస్థ ఆ బకాయిలను ఇప్పటి వరకు చెల్లించలేకపోయింది. దీంతో రెండు వరుస త్రైమాసికాలలో నిర్దిష్ట నిబంధనలను అమలు చేయకపోవడంతో ఆ సంస్థ ట్రేడింగ్‌ను తాత్కాలికంగా సస్పెండ్‌ చేస్తున్నట్లు సెబీ ప్రకటించింది. ఇవాళ్టి నుంచి 21రోజుల పాటు ఈ నిషేధం అమలులో ఉంటుందని తెలిపింది. తమ నిబంధనలకు సమ్మతి తెలపడంతో పాటు జరిమానా చెల్లించడానికి కూడా అంగీకరిస్తే నిషేధం ఎత్తివేస్తామని సెబీ స్పష్టం చేసింది. ప్రస్తుతం పీవీపీ వెంచర్స్‌ లిమిటెడ్‌ ప్రమోటర్‌ పొట్లూరి వరప్రసాద్‌ విజయవాడ లోకసభ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 



Most Popular