రివర్స్‌గేర్‌లో ఆటో స్టాక్స్‌

రివర్స్‌గేర్‌లో ఆటో స్టాక్స్‌

గత పదేళ్ళలో తొలిసారిగా 2018లో ఆటో స్టాక్స్‌ అండర్‌ పెర్ఫామ్‌ చేశాయి. ఈ ఏడాది కూడా ఈ పరిస్థితిలో మార్పు కనిపించకపోవచ్చని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. వృద్ధి నెమ్మదించంతో సంస్థాగత పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు ఈ రంగ స్టాక్స్‌కు దూరంగా ఉంటున్నారు. విదేశీ, స్థానిక ఫండ్‌ హౌజ్‌లో ఈ రంగ స్టాక్స్‌లో 8.0 శాతం, 7.5 శాతం తగ్గించుకున్నారు. నిఫ్టీ50 ఇండెక్స్‌లో ఆటో స్టాక్స్‌కు 7శాతం వెయిట్‌ ఉంది. గత కొన్నేళ్ళుగా సంస్థాగత ఇన్వెస్టర్లు ఆటో స్టాక్స్‌పై బెట్‌ను పెంచుకోవడంతో గత పదేళ్ళుగా సగటున ఆయా స్టాక్స్‌ 40-120 శాతం లాభపడ్డాయి. 

             గత ఏడాది కాలంలో ఆటో స్టాక్స్‌ డౌన్‌ట్రెండ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం టీవీఎస్‌ మోటార్స్‌ 38 శాతం ప్రీమియంతో ట్రేడవుతోన్నాయి. 2017లో ఈ స్టాక్‌ 120 ప్రీమియంతో ట్రేడైంది. ఇక వాల్యూమ్స్‌ పరంగా చూస్తే గత ఏడాది రెండో అర్ధభాగంలో మెరుగ్గా ఉన్నప్పటికీ రిటర్న్స్‌ పరంగా ఇన్వెస్టర్లను నిరాశపర్చాయి. ఇండస్ట్రీ ప్యాసింజర్‌ కార్‌ గ్రోత్‌ గత 7 నెలల్లో ఐదుసార్లు నెగిటివ్‌గా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో ద్విచక్రవాహనాల ఇండస్ట్రీ వృద్ధి 5శాతం క్షీణించింది. ఇక మార్చి నెల విషయానికి వస్తే ద్విచక్ర వాహన అమ్మకాలు నీరసించాయి. హోండా మోటార్‌సైకిల్‌ వాల్యూమ్స్‌ 47శాతం తగ్గాయి. ఇతర ద్విచక్ర వాహనాల్లో హీరోమోటోకార్ప్‌, రాయల్‌ ఎన్‌ఫీల్ట్‌ వాల్యూమ్స్‌ 20 శాతం పైగా క్షీణించాయి. 
(ఎకనామిక్ టైమ్స్ సౌజన్యంతో)Most Popular