ఎర్నింగ్స్, ఎలక్షన్స్ సహా ఈ వారం మార్కెట్లను నడిపించేవి ఇవే!!

ఎర్నింగ్స్, ఎలక్షన్స్ సహా ఈ వారం మార్కెట్లను నడిపించేవి ఇవే!!

గత వారం మార్కెట్లు పాజిటివ్ ట్రెండ్‌తో ముగిశాయి. సెన్సెక్స్ వరుసగా 7వ వారం లాభాలను నమోదు చేయగా... నిఫ్టీ సూచీ 8వ వారం లాభాల ముగింపును నమోదు చేసుకుంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను తగ్గిచడం, రూపాయి మారకంలో మార్పులు, క్రూడ్ ఆయిల్ ధరలు, మాక్రో ఎకనమిక్ నెంబర్లు.. గత వారం మార్కెట్లను నడిపించాయని మనం గమనించాం.

ఈ వారం సంగతేంటి?
రాబోయే వారంలో కూడా ఈ పరిస్థితులు మార్కెట్లను డ్రైవ్ చేయనున్నాయి. క్రూడాయిల్ ధర, రూపాయి మారకం కీలకం కానున్నాయి. అలాగే దేశీయంగా తయారీ రంగ మరియు పారిశ్రామిక గణాంకాలతో పాటు... ద్రవ్యోల్బణం డేటా కూడా విడుదల కానుంది వీటితో ఈ వారంలో మార్కెట్లకు కీలకం కానున్న పరిస్థితులను ఓసారి పరిశీలిద్దాం.

 

నాలుగో త్రైమాసిక ఫలితాలు
మార్చితో ముగిసిన త్రైమాసికానికి ఈ వారంలో ఫలితాల సీజన్ ప్రారంభం కానుంది. ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి రెండు పెద్ద ఐటీ కంపెనీలు ఈ శుక్రవారం నాడు క్యూ4 రిజల్ట్స్ ప్రకటించనున్నాయి.

 

మార్చి రీటైల్ ఇన్‌ఫ్లేషన్
మార్చి నెలకు గాను రీటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు శుక్రవారం నాడు విడుదల కానున్నాయి. వరుసగా నాలుగు నెలలు తగ్గుదల నమోదు చేసిన ద్రవ్యోల్బణం... ఫిబ్రవరిలో 2.6 శాతానికి పెరిగింది. 2019 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి 2.4 శాతంగా ద్రవ్యోల్బణం ఉండచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇది సాధ్యం అయితే, ఆర్బీఐ మరోమారు వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంది.

 

ఫిబ్రవరి ఐఐపీ
మాక్రో ఎకనమిక్ పరిస్థితులలో మరో కీలక అంశం ఫిబ్రవరికి పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు. ఇవి కూడా శుక్రవారమే విడుదల కానున్నాయి. జనవరిలో తయారీ రంగం నెమ్మదించినా ఐఐపీ 1.7 శాతంగా నమోదయింది. ఇది 2 శాతం వరకూ చేరవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

 

వడ్డీ రేటుపై ఈసీబీ నిర్ణయం
బుధవారం రోజున పాలసీ నిర్ణయాలను యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ప్రకటించనుంది. వడ్డీ రేట్ల పెంపు విషయంలో ఈసీబీ వేచి చూసే ధోరణి అవలంబించవచ్చనే అంనచాలు ఉన్నాయి. 

 

బ్రెగ్జిట్
బ్రెగ్జిట్ చుట్టూ నడుస్తున్న పరిస్థితులకు పరిష్కారం ఇప్పుడే లభించకపోవచ్చు. బ్రెగ్జిట్ నిర్ణయాన్ని జూన్ 30 వరకు వాయిదా వేయాలని బ్రిటిష్ ప్రైమ్ మినిష్టర్ థెరసా మే కోరారు. ఇప్పుడు దీన్ని మరో ఏడాది కూడా వాయిదా వేయవచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి.

 

గ్లోబల్ మాక్రో
చైనా, అమెరికాల ద్రవ్యోల్బణం డేటా, ఇలాగే ఈ దేశాల మధ్య ట్రేడ్ వార్, చైనా బ్యాలెన్స్ షీట్‌లను కూడా అంతర్జాతీయ మార్కెట్లు గమనించనున్నాయి. మార్చ్ ఫెడ్ పాలసీ కూడా కీలకం కానుంది.

 

టెక్నికల్‌ నిలకడ లేమి
గత శుక్రవారం నాడు డైలీ ఛార్టులలో స్పిన్నింగ్ టాప్ క్యాండిల్‌ను ఫామ్ చేసింది. వీక్లీ ఛార్టులలో లాంగ్-లెగ్డ్ డోజీ ఫామ్ అయింది. ఇవి రెండూ తరువాతి దశను అంచనా వేయడానికి వీలు లేని ప్యాటర్న్స్‌లు కావడంతో... మార్కెట్ రూట్‌ను అంచనా వేయడం కష్టంగా ఉంది.

 

ఎన్నికలు
ఏడు దశలుగా జరగనున్న సార్వత్రిక ఎన్నికలు ఈ వారం ప్రారంభం కానున్నాయి. నియర్-టెర్మ్ ఇండికేటర్లు సెల్ మోడ్‌లో ఉన్నాయని.. అయితే మీడియం టెర్మ్ ఆసిలేటర్ల‌ు మాత్రం బయ్ చేసేందుకు అనుకూలమని సూచిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. 

 

కీలక స్థాయిలు
సెన్సెక్స్‌కు 38280 వద్ద మద్దతు లభించనుండగా... నిఫ్టీకి 11,480 కీలక మద్దతు స్థాయి కానుంది. ఇక రెసిస్టెన్స్ లెవెల్స్‌ను పరిశీలిస్తే సెన్సెక్స్‌కు 39,580 కీలకం గాగా... 11,980 వద్ద నిఫ్టీకి నిరోధం ఎదురు కానుంది.tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');