మెట్రోపోలిస్‌ ఐపీవో.. సక్సెస్‌

మెట్రోపోలిస్‌ ఐపీవో.. సక్సెస్‌

డయాగ్నోస్టిక్స్‌ సంస్థ మెట్రోపోలిస్‌ హెల్త్‌కేర్‌ పబ్లిక్‌ ఇష్యూ విజయవంతమైంది. శుక్రవారం(5)తో ముగిసిన ఇష్యూ 5.8 రెట్లు అధికంగా సబ్‌స్క్రయిబ్‌ అయ్యింది. రూ. 870-880 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 1200 కోట్లను సమీకరించింది. ఆఫర్‌లో భాగంగా కంపెనీ దాదాపు 1.53 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. 4.43 కోట్లకుపైగా షేర్లకోసం బిడ్స్ దాఖలయ్యాయి. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్ల విభాగం(క్విబ్‌)లో 3.23 రెట్లు అధికంగా బిడ్స్‌ దాఖలుకాగా.. సంపన్న వర్గాల కోటాలో 0.35 రెట్ల స్పందనే లభించింది. అయితే రిటైల్ ఇన్వెస్టర్లు 1.36 రెట్లు అధికంగా దరఖాస్తు చేయడం గమనార్హం! కాగా.. ఇష్యూ ముందురోజు కంపెనీ యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ. 530 కోట్లు సమీకరించింది. షేరుకి రూ. 880 ధరలో 26 యాంకర్‌ సంస్థలకు షేర్లను కేటాయించింది.tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');